×
Ad

Allu Arjun: ఈ అవార్డు నా అభిమానులకు అంకితం.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం (Allu Arjun)చాలా గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Allu Arjun emotional post on receiving the Dadasaheb Phalke Award

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో అల్లు అర్జున్ కి సంవత్సరంలో అత్యంత(Allu Arjun) బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు అవార్డు వరించింది. ఈ సందర్బంగా ఆయన సోషల్ మీడియా వేదికగా జ్యురీకి కృతజ్ఞతలు తెలిపారు.

Ram Charan: “గ్లోబల్ స్టార్” ట్యాగ్ తొలగించిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడా.. ఇక నుంచి అదే పేరుతో..

“ఇంతటి అద్భుతమైన గౌరవం ఇచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులకు ధన్యవాదాలు. నిజంగా వినయంగా ఉంది. ఇతర విభాగాల విజేతలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ నిరంతర ప్రేమ మరియు మద్దతుకు నా ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు… ఈ అవార్డును నా అభిమానులకు వినయంగా అంకితం చేస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. దేంతో అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో హాలీవుడ్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.