Ram Charan: “గ్లోబల్ స్టార్” ట్యాగ్ తొలగించిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడా.. ఇక నుంచి అదే పేరుతో..
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ అభిమానంగా ఇచ్చుకునే ట్యాగ్స్ గురించి మనకు తెలుసు. (Ram Charan)మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, సుప్రీమ్ హీరో, యువసామ్రాట్.. ఇలా చాలా రకాల ట్యాగ్ లను స్టార్ మన ఆడియన్స్ ఇచ్చేశారు.
Star hero Ram Charan removes global star tag
Ram Charan: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ అభిమానంగా ఇచ్చుకునే ట్యాగ్స్ గురించి మనకు తెలుసు. మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, సుప్రీమ్ హీరో, యువసామ్రాట్.. ఇలా చాలా రకాల ట్యాగ్ లను స్టార్ మన ఆడియన్స్ ఇచ్చేశారు. అలాగే రామ్ చరణ్ కి కూడా మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా వరకు అదే ట్యాగ్ తో ఆయన సినిమాల్లో ఎంట్రీ సీన్స్ ఉంటూ వస్తున్నాయి. కానీ, ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తరువాత (Ram Charan)రామ్ చరణ్ రేంజ్ మారడంతో ఆయనను గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు శంకర్. గేమ్ ఛేంజర్ సినిమాలో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తోనే ప్రమోట్ చేశారు.
Rashmika Mandanna: రష్మిక మనసు బంగారం.. ఆ ఒక్క మాటతో డబుల్ రెమ్యునరేషన్.. ఆమె లేకుంటే..
కానీ, ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రామ్ చరణ్ పై చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చి బాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ లో రామ్ చరణ్ పేరు ముంగు గ్లోబల్ స్టార్ కి బదులుగా తన పాత ట్యాగ్ అయిన మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ కనిపించింది. దీంతో, ట్యాగ్ విషయంలో రామ్ చరణ్ మనసు మార్చుకున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో ఎన్టీఆర్ సైతం శక్తి సినిమా కోసం తన ట్యాగ్ ని మార్చుకున్నాడు. అప్పటివరకు యంగ్ టైగర్ గా ఉన్న తన ట్యాగ్ ను శక్తి సినిమాలో మాత్రం ఏ వన్ స్టార్ గా మార్చుకున్నాడు. కానీ, ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మారింది.
దాంతో నెక్స్ట్ సినిమా కోసం తన ఏ వన్ స్టార్ అనే ట్యాగ్ ను పక్కనపెట్టేశాడు ఎన్టీఆర్. కాబట్టి, ట్యాగ్ విషయంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నాడు అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే, రూరల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 మర్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ కి ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి.
