Rashmika Mandanna: రష్మిక మనసు బంగారం.. ఆ ఒక్క మాటతో డబుల్ రెమ్యునరేషన్.. ఆమె లేకుంటే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ "ది గర్ల్ ఫ్రెండ్". (Rashmika Mandanna)దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు, దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు.
Dheeraj Mogilineni emotional comments about Rashmika Mandanna (1)
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు, దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్(Rashmika Mandanna) కీ రోల్ లో కనిపించనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రాగా సినిమా కోసం కూడా అదే రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా విడుదల దగ్గుపడుతున్న నేపధ్యంలో మూవీ టీం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Nara Rohith: నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. పెళ్లి తరువాత నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..
ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని హీరోయిన్ రష్మికపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇంటర్వ్యూలో ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ..”ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రష్మిక చాలా ప్రత్యేకం.ఈ సినిమా కోసం ఆమెకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేనేజర్ ని కలవడానికి వెళ్లాం. కానీ, ఆయన అందుబాటులో లేరు. దాంతో, నేరుగా రష్మికను కలిసి రెమ్యునరేషన్ గురించి ప్రస్తావించము. దానికి, రష్మిక, ముందు సినిమా రిలీజ్ కానివ్వండి. ఆ తర్వాత రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పారు.
ఆ ఒక్క మాటతో రష్మికపై రెస్పెక్ట్ మరింత పెరిగింది. ఈ సినిమాకి ఆమె ఒక్కరూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కానీ ఆమెపై ఉన్న కృతజ్ఞతతో రెట్టింపు రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకుంటున్నాము”అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్స్ విన్న రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రష్మిక మనసు గొప్పది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
