Allu Arjun
Allu Arjun: అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీలోనే కాదు.. టాలీవుడ్ హీరోల్లోనే తన రూట్ సెపరేట్. మెగాస్టార్ అడుగు జాడల్లో ఇండస్ట్రీకి వచ్చినా.. అది మొదటి అడుగు వరకే పరిమితం చేశాడు బన్నీ. ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒంటరిగానే నిలదొక్కుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ ఎందుకు ఆడియన్స్ కి అంతగా నచ్చుతాడు..? ఈ స్టార్ హీరోలో ఉన్న సమ్ థింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏంటి..?
Allu Arjun: 40 ఏళ్ల వయసులో నేషనల్ స్టార్ డమ్.. నిలబెట్టుకుంటాడా?
తగ్గేదే లే.. అవును సినిమా కలెక్షన్లతో పాటు బన్నీ పాపులారిటీ, ఫాన్ ఫాలోయింగ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు అల్లు అర్జున్. అంతేకాదు ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క అంటున్నారు బన్నీ. అంతకుముందు వరకూ లోకల్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్.. పుష్ప లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ చేసి మ్యాసివ్ హిట్ తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు.
Allu Arjun : పార్టీ చేసుకో అంటూ.. అల్లుడిపై చిరంజీవి స్పెషల్ ట్వీట్
బన్నీ గురించి ప్రతీదీ ఇంట్రస్టింగ్ ఎలిమెంటే. చిరంజీవి అల్లుడిగా, అరవింద్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ లో తనకంటూ సెపరేట్ క్రేజ్ ని, ఇమేజ్ ని ఆర్మీని సంపాదించుకుని సోలోగా తన రూట్ సెపరేట్ చేసుకుంటున్నారు. పాత్ బ్రేకింగ్ మూవీస్ తో ఇండిపెండెంట్ గా తన సక్సెస్ ని తనే రాసుకుంటున్నారు బన్నీ.
Allu Arjun-Dhanush: బ్లాస్టింగ్ అప్డేట్.. బన్నీతో ధనుష్ భారీ మల్టీస్టారర్?
సక్సెస్ అయినప్పుడు ఎంత సెలబ్రేట్ చేసుకుంటారో.. హిట్ లేనప్పుడు, రానప్పుడు అసలు ఫ్లాప్ అవ్వడానికి గల రీజన్స్ ఎనలైజ్ చేసుకుంటారు బన్నీ. అందుకే అలవైకుంఠపురం లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత సేఫ్ గా కమర్షియల్ మూవీ కాకుండా పుష్ప రాజ్ లాంటి కంప్లీట్ డీ గ్లామర్ లుక్ లో బాక్సాఫీస్ బద్దలు కొట్టారు బన్నీ. ఇందులో కూడా బన్నీ రూట్ సెపరేట్ గానే కనిపిస్తోంది.
Allu Arjun: బన్నీని వాయించేసిన పూజా హెగ్డే.. అన్‌సీన్ వీడియో!
టాలీవుడ్ కి తన మార్క్ స్టైల్ స్టేట్ మెంట్స్ ని ఇస్తూ.. అందరిలో స్పెషల్ అనిపించుకుంటున్న బన్నీ, ఫస్ట్ నుంచి తన ఈజ్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. ఎంత పెద్ద స్టార్ అయినా సింపుల్ గా ఉండే ఆ డైలాగ్ డెలివరీ, స్టోరీ సెలక్షన్ తో పడేశాడు ఫ్యాన్స్ ని. కెరీర్లో ఎక్స్ పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే బన్నీ.. కరెక్ట్ స్టోరీ దొరికే వరకూ టైమ్ తీసుకుంటారు. అందుకే నాపేరు సూర్య డిజాస్టర్ తర్వాత.. సెల్ఫ్ చెక్ చేసుకుని మంచి స్క్రిప్ట్ దొరికే వరకూ వెయిట్ చేశారు. ఇలా ప్రతి సినిమాకి యాక్టింగ్ వైజ్, క్యారెక్టర్ వైజ్, అప్పియరెన్స్ వైజ్ వేరియేషన్స్ చూపిస్తూ.. ఇంప్రొవైజ్ అవుతూ కెరీర్ ని స్పీడప్ చేస్తూ నంబర్ వన్ దిశగా దూసుకెళుతున్నారు.
Allu Arjun : మేనేజర్ పెళ్ళికి సడెన్‌గా వచ్చి సర్‌ప్రయిజ్ ఇచ్చిన అల్లు అర్జున్
మాస్ ఫ్యాన్స్ కి బన్నీకి మించిన హీరోలేడనేలా, క్లాస్ కి అదే లెవల్లో క్లాసీనెస్ ని చూపించేలా తనను తాను మౌల్డ్ చేసుకున్న బన్నీ.. డ్యాన్స్ లో తనకు ఎదురు లేదని ప్రూవ్ చేసుకున్నాడు. డ్యాన్స్ లో తన తర్వాతే ఎవరైనా. అంత ఫాస్ట్ మూమెంట్స్, ట్రికీ స్టెప్స్, టఫ్ పోస్చర్స్.. ఇలా ఎలాంటివైనా ఈజీగా చేసేస్తాడు బన్నీ. అందుకే సినిమా ఎలా ఉన్నా.. తన స్టెప్స్, డ్యాన్స్ లో మాత్రం స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తాడు బన్నీ.
Allu Arjun : సంజయ్‌లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సమావేశం.. సినిమా కోసమేనా??
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. బట్.. ఆ స్టైల్ నే తన ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నాడు అల్లు అర్జున్. డ్రెస్సింగ్, కార్, క్యారవాన్ ఇలా ప్రతీ దాన్లో తన మార్క్ స్టైల్ చూపించాల్సిందే బన్నీ. ఇలా పాపులారిటీ దగ్గరనుంచి స్టోరీ సెలక్షన్, సినిమాలతో ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడం, స్టైలిష్ ఐకాన్ గా ఫాన్స్ ని ఎంగేజ్ చెయ్యడం, హీరోలకు సరికొత్త స్టైలింగ్ గోల్స్ సెట్ చెయ్యడం.. ఇలా ఇండిపెండెంట్ గా తన క్రేజ్ ని పెంచుకుంటూ తన రూటే సెపరేట్ అనిపించుకుంటున్నాడు బన్నీ.