Allu Arjun : నా ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆయన ఫోటోనే కనిపిస్తుంది.. నా మనసులో ఆయనకు అంత స్థానం ఉంది..

బాలయ్య ఆహా అన్‌స్టాప‌బుల్ షో ఇప్పటివరకు మూడు ఎపిసోడ్స్ పూర్తవ్వగా తాజాగా నాలుగో ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు.

Allu Arjun Interesting Comments about That Senior Director in Balakrishna Unstoppable Show

Allu Arjun : బాలయ్య ఆహా అన్‌స్టాప‌బుల్ షో ఇప్పటివరకు మూడు ఎపిసోడ్స్ పూర్తవ్వగా తాజాగా నాలుగో ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ సినీ కెరీర్ లో ముఖ్యమైన వాళ్ళతో వీడియో బైట్స్ తీయించి షోలో ప్లే చేసారు బాలయ్య. ఈ వీడియోల్లో అల్లు అర్జున్ గురించి రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, దిల్ రాజు, గుణశేఖర్ మాట్లాడారు.

రాఘవేంద్ర రావు 100వ సినిమాగా, అల్లు అర్జున్ మొదటి సినిమాగా గంగోత్రి రిలీజయి మంచి విజయమే సాధించింది. రాఘవేంద్రరావు ఆ సినిమా గురించి మాట్లాడి తగ్గేదేలే అంటూ అల్ ది బెస్ట్ చెప్పారు బన్నీకి.

Also Read : Trivikram – Allu Arjun : దిష్టి తగిలేంత గొప్పోడు అయిపోయాడు బన్నీ.. అల్లు అర్జున్ ని తెగ పొగిడిన త్రివిక్రమ్.. బాలయ్య షోలో..

దీంతో అల్లు అర్జున్ రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ.. నా ఆఫీస్ లోకి ఎవరైనా వస్తే ఫస్ట్ కనపడేది రాఘవేంద్రరావు గారి ఫోటోనే. దాని కింద నా ఫస్ట్ డైరెక్టర్ అని రాసి ఉంటుంది. ఆయనకు నా మనసులో అంత స్థానం ఇచ్చాను. చిన్నప్పుడు నేను డ్యాన్సులు వేస్తుంటే నన్ను పిలిచి 100 రూపాయలు ఇచ్చారు. ఆయనే నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి నన్ను హీరోని చేసారు అని చెప్పారు. దీంతో బన్నీ రాఘవేంద్రరావు గారికి ఎంత వ్యాల్యూ ఇస్తారో అర్ధమవుతుంది.