Allu Arjun Interesting Comments on Pushpa 2 Movie Pre Release Business
Allu Arjun : అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతున్నాడు. దేశమంతా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుండగా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. ఇటీవల పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి నార్త్ లో పుష్ప 2 హవా ఏ రేంజ్ లో ఉందో చూపించారు.
పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ ఇటీవల బాలకృష్ణ ఆహా అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసాడు. ఈ సినిమాలో పుష్ప 2 సినిమా గురించి కూడా బోలెడన్ని విషయాలు తెలిపారు. అయితే పుష్ప 2 సినిమా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
Also Read : Allu Arjun : ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక సంవత్సరం బ్రేక్ తీసుకున్నా.. ఎవరు ఏం చెప్పినా..
బాలయ్య పుష్ప 2 సినిమా 1000 కోట్ల బిజినెస్ చేసిందట కదా అని అడగ్గా అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. అది మైత్రి నిర్మాతలను అడగాలి. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఎంత బిజినెస్ చేస్తుంది అని తెలీదు కానీ ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా చేయనంత బిజినెస్ పుష్ప 2 సినిమా చేస్తుంది అది మాత్రం గ్యారెంటీ అని అన్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలని వైరల్ చేస్తూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నారు.