Allu Arjun : ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక సంవత్సరం బ్రేక్ తీసుకున్నా.. ఎవరు ఏం చెప్పినా..

అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Allu Arjun : ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక సంవత్సరం బ్రేక్ తీసుకున్నా.. ఎవరు ఏం చెప్పినా..

Allu Arjun Reveals Interesting Thing after Naa Peru Surya Naa Illu India Movie Failure

Updated On : November 23, 2024 / 2:35 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ బాలకృష్ణ ఆహా అన్‌స్టాపబుల్ షోకి రాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్ 2 తాజాగా రిలీజ్ చేసారు. ఇందులో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొన్ని సీరియస్ విషయాలు, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు బన్నీ.

ఈ క్రమంలో బన్నీ మాట్లాడుతూ.. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయ్యాక ఆరు నెలల నుంచి సంవత్సరం బ్రేక్ తీసుకున్నా. ఆ సమయంలో నేను చాలా మారాలి అనిపించింది. మనం ఇంకా ఎదగాలి అంటే మారాలి. ఆ సమయంలో ఎవరన్నా నాలో నెగిటివ్ చెప్తే వినేవాడ్ని కానీ అది నా మైండ్ కి తీసుకునేవాడ్ని కాదు. అది తెలుసుకున్నాను. నేను వేరే లెవల్ కి వెళ్ళాలి అంటే అందరూ చెప్పేవి కూడా తీసుకోవాలి అని ఫిక్స్ అయి అప్పట్నుంచి ఎవరు ఏం చెప్పినా వింటూ నేర్చుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే మీ అందరూ గర్వించే స్థాయికి చేరుకుంటాను అని అన్నారు.

Also Read : Pushpa 2 – Allu Arjun : బ్యాక్ పెయిన్ వచ్చి.. షూటింగ్ కూడా ఆపేసి.. బాలయ్యతో పుష్ప 2 కష్టాలు పంచుకున్న బన్నీ..

అలాగే తనలో తాను ఏమైనా మార్చుకోవాలా అని అడిగితే అల్లు అర్జున్.. షూటింగ్స్ ఉంటే తొందరగా పడుకొని తొందరగా లెగుస్తాను కానీ షూటింగ్స్ లేకపోయినా తొందరగా లెగాలి. ఉదయాన్నే 4 – 5 మధ్యలో లెగాలి. అది మార్చుకోవాలి అని తెలిపాడు.

2018లో అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా నిరాశ పరచగా ఆ తర్వాత బ్రేక్ తీసుకొని బన్నీ అలవైకుంఠపురంలో సినిమా చేసాడు. ఇక అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. అలవైకుంఠపురంలో తర్వాత పుష్ప ఇప్పుడు పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అవుతున్నాడు బన్నీ.