Pushpa 2 – Allu Arjun : బ్యాక్ పెయిన్ వచ్చి.. షూటింగ్ కూడా ఆపేసి.. బాలయ్యతో పుష్ప 2 కష్టాలు పంచుకున్న బన్నీ..

తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ దీని గురించి మాట్లాడాడు.

Pushpa 2 – Allu Arjun : బ్యాక్ పెయిన్ వచ్చి.. షూటింగ్ కూడా ఆపేసి.. బాలయ్యతో పుష్ప 2 కష్టాలు పంచుకున్న బన్నీ..

Allu Arjun speak about his hard work for Pushpa 2 Movie in Balakrishna Unstoppable Show

Updated On : November 23, 2024 / 2:16 PM IST

Pushpa 2 – Allu Arjun : అల్లు అర్జున్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి రాగా ఈ ఎపిసోడ్ పార్ట్ 2 తాజాగా రిలీజయి ట్రెండ్ అవుతుంది. పార్ట్ 2 లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి సందడి చేసారు. ఆ తర్వాత పుష్ప 2 సినిమా గురించి కూడా బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

అయితే పుష్ప 2లో జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ లేడీ గెటప్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సీక్వెన్స్ పోస్టర్స్, గ్లింప్స్ వచ్చి బాగా వైరల్ అయ్యాయి. వాటిని చూస్తుంటేనే అల్లు అర్జున్ ఆ గెటప్ కోసం ఎంత బాగా కష్టపడ్డాడో అర్ధమవుతుంది. తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ దీని గురించి మాట్లాడాడు.

Also Read : Allu Arjun : ఆ బాధ ఉండిపోయింది.. అల్లు అర్జున్ తీరని కోరిక ఏంటో తెలుసా.. బాలయ్య షోలో ఎమోషనల్ అయిన బన్నీ..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. లేడీ గెటప్ వేసుకున్నప్పుడు మీ నాన్న గారినే(ఎన్టీఆర్) తలుచుకున్నాను. అసలు అలా ఎలా చేసారో అనిపించేది. మెంటల్ గా, ఫిజికల్ గా చాలా కష్టపడ్డాను ఆ గెటప్ కోసం. ఆ చీర, మేకప్, పైన నగలు అన్ని వేసుకొని చాలా సేపు చేసేసరికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. నా వల్ల కాక కొన్నిరోజులు షూటింగ్ కూడా ఆపేసారు మధ్యలో అని తెలిపాడు. దీంతో బన్నీ పుష్ప 2 షూటింగ్ కోసం, ముఖ్యంగా లేడీ గెటప్ కోసం బాగా కష్టపడినట్టు తెలుస్తుంది.

ఇక ఆ లేడీ గెటప్ తో ఉండే జాతర సీక్వెన్స్ ని బాగా గ్రాండ్ గా చేసారని, ఆ సీక్వెన్స్ కోసమే ఆరు కోట్లు ఖర్చుపెట్టారని సమాచారం. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ లో మెప్పించిన ఆ లేడీ గెటప్ సీక్వెన్స్ సినిమాలో ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.