Allu Arjun : ఆ బాధ ఉండిపోయింది.. అల్లు అర్జున్ తీరని కోరిక ఏంటో తెలుసా.. బాలయ్య షోలో ఎమోషనల్ అయిన బన్నీ..
అల్లు అర్జున్ కి ఓ కోరిక మాత్రం మిగిలిపోయిందట. అది తీరలేదని అప్పుడప్పుడు బాధపడతారట.

Allu Arjun got Emotional in Balakrishna Unstoppable Show while Remembering His Grand Father Allu Ramalingaiah
Allu Arjun : అల్లు అర్జున్ ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆహా ఓటీటీలో బాలయ్య – అల్లు అర్జున్ ఎపిసోడ్ దూసుకుపోతుంది. తాజాగా పార్ట్ 2 రిలీజ్ చేయగా ఇందులో కూడా అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read : Chiranjeevi – Allu Arjun : అల్లు అర్జున్ చిరంజీవిని ఏమని పిలుస్తాడో తెలుసా..
అయితే అల్లు అర్జున్ కి ఓ కోరిక మాత్రం మిగిలిపోయిందట. అది తీరలేదని అప్పుడప్పుడు బాధపడతారట. బాలయ్య అల్లు అర్జున్ ని వాళ్ళ తాతయ్య అల్లు రామలింగయ్య గారి గురించి అడిగారు. దీనికి అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. అయన ఎప్పుడూ గుర్తొస్తుంటారు. తాతయ్యతో కలిసి నటించలేదనే బాధ ఉంది. నేను గంగోత్రి, ఆర్య చేసినప్పుడు ఆయన ఉన్నారు. ఆర్యలో ఆయనతో చిన్న రోల్ అయినా చేయిస్తే బాగుండేది అని ఇప్పటికి ఫీల్ అవుతాను. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అయన ఉండి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. మా నాన్న ఎంత గర్వించినా, మా తాతయ్య ఆయన వారసత్వం నటుడిగా అని గర్వించేవాడు అంటూ తాతయ్యని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు.