Chiranjeevi – Allu Arjun : అల్లు అర్జున్ చిరంజీవిని ఏమని పిలుస్తాడో తెలుసా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

Chiranjeevi – Allu Arjun : అల్లు అర్జున్ చిరంజీవిని ఏమని పిలుస్తాడో తెలుసా..

Do you know what Allu Arjun called megastar Chiranjeevi bunny comments goes viral

Updated On : November 23, 2024 / 1:45 PM IST

Chiranjeevi – Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇటు బన్నీ అటు సుకుమార్ సైతం సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చెయ్యగా యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. పాట్నాలో రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ కి లక్షల కొద్ది జనం వచ్చారు. అలాగే పుష్ప 2 నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సైతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇక పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే నందమూరి నటసింహం బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. కేవలం బన్నీ మాత్రమే కాకుండా తన పిల్లలు, తల్లి కూడా వచ్చారు. ఇందులో భాగంగానే బన్నీ పుష్ప 2 సినిమా విషయాలే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సంబందించిన ప్రశ్న కూడా ఎదురైంది. దీని గురించి బన్నీ మాట్లాడుతూ.. నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం. చిన్నపట్నుంచి ఆయన్నిచూస్తున్నాను. హీరోగానే కాదు.. ఒక మంది మనసున్న వ్యక్తిగా ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అంటూ తెలిపాడు బన్నీ. అంతేకాదు చిన్నప్పటి నుండి ఆయన్ని చిక్ బాబాయ్ అని పిలుస్తాం అంటూ సీక్రెట్ రివీల్ చేసాడు.

Also Read : Sreeleela : ‘కిస్సిక్’ సాంగ్ విడుదలకి ముందు వారణాసిలో శ్రీలీల పూజలు..

దీంతో బన్నీ చేసిన ఈ వ్యాఖలు నెట్టింట వైరల్ అవుతున్నయి. ఇకపోతే చిరు, అల్లు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరుని బన్నీ చిక్ బాబాయ్ అని పిలుస్తామని చెప్పడంతో వారి మధ్య ఉన్న అనుబందం మరోసారి తెలిసింది.