Sreeleela : ‘కిస్సిక్’ సాంగ్ విడుదలకి ముందు వారణాసిలో శ్రీలీల పూజలు..

టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Sreeleela : ‘కిస్సిక్’ సాంగ్ విడుదలకి ముందు వారణాసిలో శ్రీలీల పూజలు..

Before the release of the allu arjun pushpa 2 movie Kissik song Sreeleela visit Varanasi photos goes viral

Updated On : November 23, 2024 / 10:58 AM IST

Sreeleela : టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాల్లో తన డాన్స్ తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు చదువు కొనసాగింస్తుంది. అలానే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది.

Also Read : Pushpa 2 : ‘పుష్ప2’ నుంచి ‘కిస్సిక్’ సాంగ్ ప్రొమో వ‌చ్చేసింది..

అయితే తాజాగా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కిస్సిక్ అనే ఈ స్పెషల్ సాంగ్ రేపు (నవంబర్ 24న) విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సాంగ్ కి సంబందించిన పోస్టర్ సైతం విడుదల చెయ్యగా అది నెట్టింట ఎంతో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్.

ఇకపోతే ఈ సాంగ్ రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో శ్రీలీల తన తల్లి స్వర్ణలతతో కలిసి వారణాసి వెళ్ళింది. పుష్ప సినిమా అలాగే కిస్సిక్ సాంగ్ మంచి సక్సెస్ సాధించాలని పూజా కార్యక్రమాలను నిర్వహించింది. అక్కడి ప్రార్థనలు చేసి పవిత్ర గంగా ఘాట్ ను దర్శించుకున్నారు. అయితే కిస్సిక్ సాంగ్ శ్రీలీల కెరీర్ లో చాలా స్పెషల్. ఎందుకంటే ఐకాన్ స్టార్ లాంటి ఓ పెద్ద హీరోతో చెయ్యడమంటే మామూలు విషయం కాదు. అందులోను ఈ కిస్సిక్ సాంగ్ పుష్ప సినిమాకి కూడా కీలకం కానుంది. అందుకే వారణాసి వెళ్లి దర్శనం చేసుకుంది ఈ బ్యూటీ. దీంతో శ్రీలీలకి సంబందించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.