Pushpa 2 : ‘పుష్ప2’ నుంచి ‘కిస్సిక్’ సాంగ్ ప్రొమో వ‌చ్చేసింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప 2.

Pushpa 2 : ‘పుష్ప2’ నుంచి ‘కిస్సిక్’ సాంగ్ ప్రొమో వ‌చ్చేసింది..

KISSIK Song Promo from Pushpa 2 out now

Updated On : November 23, 2024 / 10:27 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌. డిసెంబ‌ర్ 5న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్రంలోని ఒక్కొ పాట‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన టీజ‌ర్‌, సాంగ్స్ సినిమా పై అంచ‌నాల‌ను భారీగా పెంచాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి మాస్ సాంగ్ ను న‌వంబ‌ర్ 24 న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే చిత్ర బృందం తెలిపింది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేసింది. మొత్తంగా ప్రొమో ఆక‌ట్టుకుంటోంది.పూర్తి పాట కోసం రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. 24న రాత్రి 7:02 నిమిషాలకి పూర్తి పాట రిలీజ్ కానుంది.

Zebra : ‘జీబ్రా’ మూవీ రివ్యూ.. బ్యాంకింగ్ వ్యవస్థపై మరో సినిమా..

కిస్సిక్ పాటను తెలుగు, తమిళం, కన్నడ ఈ మూడు భాషల్లోనూ సుబ్లాషిని పాడారు. హిందీలో కూడా సుబ్లాషినితో పాటు లోహితా పాడారు. ఇక మలయాళంలో ప్రియా జెర్సన్, బెంగాలీలో సింగర్ ఉజ్జయిని ముఖర్జీ పాడారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.