Zebra : ‘జీబ్రా’ మూవీ రివ్యూ.. బ్యాంకింగ్ వ్యవస్థపై మరో సినిమా..

'జీబ్రా' సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లోపాలు, ఫ్రాడ్స్ ని చూపిస్తూనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.

Zebra : ‘జీబ్రా’ మూవీ రివ్యూ.. బ్యాంకింగ్ వ్యవస్థపై మరో సినిమా..

Satya Dev Zebra Movie Review and Rating

Updated On : November 23, 2024 / 9:22 AM IST

Zebra Movie Review : సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా జెన్నిఫర్ పిషినాటో, సత్యరాజ్, సత్య.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జీబ్రా సినిమా నిన్న నవంబర్ 22న థియేటర్లలో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. సూర్య(సత్యదేవ్) ఓ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటాడు. మరో బ్యాంక్ లో పనిచేసే స్వాతి(ప్రియా భవాని శంకర్)తో ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఓ సారి స్వాతి చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక అకౌంట్ లో పడాల్సిన 4 లక్షలు ఇంకో అకౌంట్ లో పడతాయి. దీంతో ఆ డబ్బులు రావాల్సిన వ్యక్తి ఆమెని ఇబ్బంది పెట్టడంతో సూర్య బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకొని ఓ ఫ్రాడ్ చేసి ఆ 4 లక్షలు అతనికి వచ్చేలా చేస్తాడు.

అయితే అదే సమయంలో ఆ డబ్బులు తప్పుగా పడిన అకౌంట్ నుంచి 5 కోట్లు మాయమయి సూర్య మరో అకౌంట్ లో పడతాయి. దీంతో గ్యాంగ్ స్టర్ ఆది(డాలి ధనుంజయ) 5 కోట్ల కోసం కోసం సూర్య వెంబడి పడి ఇచ్చిన గడువు లోపు 5 కోట్లు తిరిగివ్వకపోతే తన తల్లిని చంపేస్తా అంటాడు. దీంతో సూర్య ఆ 5 కోట్ల కోసం ఏం చేసాడు? అసలు ఆ 5 కోట్లు ఎలా మిస్ అయ్యాయి? బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే కొన్ని ఫ్రాడ్స్ ఏంటి? సూర్య – స్వాతి ప్రేమకథ ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Devaki Nandana Vasudeva : ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీ రివ్యూ.. బోయపాటి మార్క్ సినిమాకు ప్రశాంత్ వర్మ టచ్..

సినిమా విశ్లేషణ.. ఇటీవల బ్యాంకింగ్ స్కామ్స్ గురించి సిరీస్ లు, సినిమాలు వస్తున్నాయి. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమా కూడా వచ్చింది. ఈ జీబ్రా సినిమా కూడా బ్యాంకింగ్ వ్యవస్థ, అందులో ఉండే లోపాలు, జరిగే ఫ్రాడ్స్ ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు. దర్శకుడు గతంలో బ్యాంక్ ఎంప్లాయ్ కావడంతో అన్ని డిటైలింగ్ గా చూపించినా అవి నార్మల్ ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంలో చెప్పడానికి కొంత తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ అన్ని పాత్రలను పరిచయం చేస్తూ స్వాతి చేసిన తప్పు, దాన్ని సూర్య డీల్ చేసే విధానం, సూర్య వేరే వాళ్ళు చేసిన ఫ్రాడ్ లో ఇరుక్కొని ఆదికి దొరకడంతో ఆసక్తిగానే సాగుతుంది. ఇంటర్వెల్ కే కథ ఏంటి, క్లైమాక్స్ ఏంటి అని ఓ ఊహకి వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఆది సూర్య వెంటపడటం, సూర్య ఏం చేసాడు, ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అని చూపిస్తూ చివర్లో ఓ చిన్న ట్విస్ట్ ఇస్తారు.

ప్రతి సీన్ నెక్స్ట్ సీన్ కి కనెక్టివిటీ ఉండటంతో సినిమా మొదటి నుంచి మొత్తం చూడాల్సిందే. మధ్యలో నుంచి చూస్తే అర్ధం కాకపోవచ్చు. సెకండ్ హాఫ్ ని మాత్రం కాస్త సాగదీశారు. పెద్ద గ్యాంగ్ స్టర్ 5 కోట్ల కోసం సూర్య వెనక పడటం లాంటివి కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. ఇక టైటిల్ కి తగ్గట్టు మనిషిలో మంచి, చెడు రెండు ఉంటాయి అని జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు. సూర్య బ్యాంకింగ్ వ్యవస్థలో చేసే ఫ్రాడ్స్ మాత్రం చాలా క్లియర్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఓ ఐటెం సాంగ్ అవసరం లేకపోయినా పెట్టినట్టు అనిపిస్తుంది. లక్కీ భాస్కర్ వచ్చిన కొన్ని రోజులకే ఈ సినిమా రావడం దీనికి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇప్పటికే సత్యదేవ్ తన నటనతో ప్రూవ్ చేసుకొని మెగాస్టార్ తో కూడా బెస్ట్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా తన బెస్ట్ ఇచ్చాడు. పుష్ప సినిమా తర్వాత ధనుంజయ ఇందులో నెగిటివ్ షేడ్స్ లో బాగానే మెప్పించాడు. ప్రియా భవాని శంకర్ పర్వాలేదనిపిస్తుంది. సత్య బాగానే నవ్వించాడు. సత్యరాజ్, జెన్నిఫర్, సునీల్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు మాత్రం వర్కౌట్ అవ్వలేదు. బ్యాంక్ సెటప్స్, గ్యాంగ్ స్టర్ సెటప్స్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేసింది. దర్శకుడు కథని కొత్తగా తీసుకున్నా మంచి డిటైలింగ్ తో చూపించే ప్రయత్నం చేసినా కథనం ఇంకొంచెం బలంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘జీబ్రా’ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లోపాలు, ఫ్రాడ్స్ ని చూపిస్తూనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. సస్పెన్స్, స్కామ్స్ లాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.