Allu Arjun Modifies his Land Rover Range Rover: సెలబ్రిటీలు వాడే లగ్జరీ కార్లు, బైకుల ధరతో పాటు వాటి ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతుంటాం. గతేడాది కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఆ వాహనాన్ని మోడిఫై చేయించారు.
వాహనానికి ఆల్-బ్లాక్ ట్రీట్మెంట్‌తో పాటు ఫ్రంట్ గ్రిల్, బ్రాండ్ లోగోలు మరియు క్రోమ్ ఫినిష్‌లో ఉన్న వాహనంలోని మిగతా పార్ట్స్ అన్నీ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుండడంతో ఎస్‌యూవీకి రాయల్ లుక్ వచ్చింది.
ఇది ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, దీని ధర రూ .2 కోట్లకు దగ్గరగా ఉంటుంది. ఎక్స్-షోరూమ్ మరియు అదనపు ఫీచర్లతో కలుపుకుంటే ఆన్-రోడ్ రేటు మరికొన్ని లక్షలు ఎక్కువ అవుతుంది. ఇండియా మార్కెట్‌లో పలు మోడల్స్ రేంజ్ రోవర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకిది ఫేవరెట్ ఎస్‌యూవీ.