Allu Arjun New look goes viral after getting National Award
Allu Arjun : ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో(National Film Awards) ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకొని అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప(Pushpa) సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు గెలుచుకున్నారు. మొట్టమొదటి సారి ఓ తెలుగు నటుడు బెస్ట్ యాక్టర్ గెలుచుకోవడంతో అల్లు అర్జున్ మరింత వైరల్ అవుతున్నారు.
ఇక మొన్నటి నుంచి అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు అంతా అల్లు అర్జున్ కి అభినందనలు తెలుపుతున్నారు. నేడు అల్లు అర్జున్ ఆహా ఆఫీస్ ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆహా ఉద్యోగులు అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆహా ఆఫీస్ కి అల్లు అర్జున్ స్టైలిష్ గా బ్లాక్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చాడు. పుష్ప సినిమా కోసం బన్నీ కొంచెం జుట్టు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం మరింత జుట్టు పెంచాడు బన్నీ. తాజాగా పిలక వేసుకొని బన్నీ ఆహా ఆఫీస్ కి వచ్చాడు. దీంతో బన్నీ పిలక లుక్ వైరల్ గా మారింది. బన్నీని పిలక చూడటం ఇదే మొదటిసారి అని, ఈ లుక్ లో కూడా బన్నీ బాగున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక కొంతమంది అయితే ఈ లుక్ పుష్ప 2 లో ఉంటుందా? పిలక వేసింది పుష్ప 2 సినిమా కోసమేనా అని కామెంట్స్ చేస్తున్నారు.
Baby Movie : ఓటీటీలో కూడా బేబీ రికార్డ్.. ఒక్కరోజులోనే 100 మిలియన్ నిమిషాల వ్యూస్..
మరి సడెన్ గా బన్నీ ఇలా పిలకతో ఎందుకు కనపడ్డాడో కానీ ఈ లుక్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
Celebrating Icon Star @alluarjun 's National Award, at aha's office. Thaggedele style ?
.
.
.
.
.
.#NationalAwards #BestActor #AlluArjun #AlluArjun? #IconStar #Aha #Pushpa #PushpaRaj #pushpa2therule #PushpaTheRule pic.twitter.com/b3iUS7DnEq— ahavideoin (@ahavideoIN) August 26, 2023
National Award winning actor #AlluArjun gets a GRAND reception as he arrives in black Range Rover to aha office.
||#Pushpa | #Pushpa2 |#Pushpa2TheRule || pic.twitter.com/rXD6soFxZi
— Manobala Vijayabalan (@ManobalaV) August 26, 2023