Pushpa 2 : బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప-2’ ఊచకోత.. 11 రోజుల వసూళ్లు ఎంతంటే?

పుష్ప 2 విడుదలై 11 రోజులు పూర్తి చేసుకుంది.

Allu Arjun Pushpa 2 movie 11 days collections

Pushpa 2 : బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. ఇక ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వసూళ్ల విషయంలో మాత్రం తగ్గడం లేదు. విడుదలైన మొదటి ఆట నుండి రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది.

Also Read : Srikakulam Sherlockholmes Trailer : వెన్నెల కిషోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ ట్రైలర్ వచ్చేసింది..

ఇక పుష్ప 2 విడుదలై 11 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా 11 రోజులు పూర్తయ్యే సరికి ‘పుష్ప-2’ మూవీ వరల్డ్‌ వైడ్‌గా ఏకంగా రూ.1409 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ పుష్ప 2 మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. 1000 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన పలు టాలీవుడ్ తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ తక్కువ సమయంలో ఇంత మొత్తంలో వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు బ్రేక్ చేసింది పుష్ప 2.


ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా పుష్ప 2 కి సీక్వెల్ గా పార్ట్ 3 కూడా ఉంది.