Srikakulam Sherlockholmes Trailer : వెన్నెల కిషోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ ట్రైలర్ వచ్చేసింది..

వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్.

Srikakulam Sherlockholmes Trailer : వెన్నెల కిషోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ ట్రైలర్ వచ్చేసింది..

Vennela Kishore Srikakulam Sherlockholmes movie Trailer released

Updated On : December 16, 2024 / 6:38 PM IST

Srikakulam Sherlockholmes Trailer : వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఫ‌న్నీ డిటెక్టివ్‌ పాత్రలో వెన్నెల‌కిషోర్ కనిపించనున్నాడు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ కంప్లీట్‌గా శ్రీకాకుళం యాస‌లో ఉంటుంది. ఈ సినిమాలో వెన్నెల‌కిషోర్‌తో పాటు అన‌న్య నాగ‌ళ్ల మ‌రో కీల‌క పాత్ర‌లో నటిస్తుంది. మోహన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్..

Also Read : Aamir Khan : తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం పై అప్డేట్ ఇచ్చిన అమీర్ ఖాన్..

ఇక ట్రైలర్ లో.. ఒక ఊర్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది ఎవ్వరికీ అర్ధం కాదు. పోలీసులు కూడా ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేకపోతారు. దాంతో ఓ తెలివైన డిటెక్టివ్‌ వెన్నెల కిషోర్ ను రంగంలోకి దింపుతారు. ఇక వెన్నెల కిషోర్ ఆ హత్యల వెనక ఎవరున్నారు.. కారణాలు ఏంటో తెలుసుకుంటాడు. మొత్తానికి ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ మీరు కూడా చూసెయ్యండి…