Allu Arjun – Pushpa 2 Collections : అల్లు అర్జున్ నెక్స్ట్ టార్గెట్ బాహుబలి 2.. కలెక్షన్స్ విషయంలో అది కూడా బ్రేక్ చేస్తాడా?

తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 21 రోజుల కలెక్షన్స్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Allu Arjun Pushpa 2 Movie 21 Days Collections Announced Next Target Bahubali 2

Allu Arjun – Pushpa 2 Collections : ఓ పక్కన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనతో వివాదంలో నిలిచినా పుష్ప 2 సినిమా మాత్రం ఇంకా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ వివాదంతో కలెక్షన్స్ కాస్త పెరిగాయని అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 21 రోజుల కలెక్షన్స్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పుష్ప 2 సినిమా 21 రోజుల్లో ఏకంగా 1705 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

దీంతో పుష్ప 2 కలెక్షన్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు 1700 కోట్లలో ఆల్మోస్ట్ 700 కోట్లకు పైగా కేవలం హిందీ నుంచే వచ్చాయి. హిందీలో పుష్ప 2 కి క్రేజ్ ఇంకా తగ్గలేదు. మొదటి రోజే 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఓపెనింగ్ డే రికార్డులు అన్ని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఆరు రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యంత వేగంగా 1000 కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది.

Also Read : Dil Raju : బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు చిన్న అంశం.. సీఎంతో మీటింగ్ తర్వాత దిల్ రాజు కామెంట్స్..

ఇప్పుడు 21 రోజుల్లోనే 1705 కోట్లు వచ్చాయి. ఇదే ఊపు కొనసాగితే నెక్స్ట్ బాహుబలి 2 రికార్డ్ కూడా బ్రేక్ చేసేలా ఉంది ఈ సినిమా. బాహుబలి 2 సినిమా 1800 కోట్లు వసూలు చేసి కలెక్షన్స్ విషయంలో రెండో హైయెస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది. మొదటి ప్లేస్ లో దంగల్ సినిమా 2000 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.

ఓ పక్క నార్త్ లో ఇంకా పుష్ప 2 హవా కొనసాగడం, మరో వైపు ఇంకా సంధ్య థియేటర్ వివాదంతో అల్లు అర్జున్, పుష్ప 2 రోజు వార్తల్లో ఉండటం, క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఉండటంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగేలా ఉన్నాయి. దీంతో ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్ ని ఈజీగానే అల్లు అర్జున్ బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ తో పాటు సినీ ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇదే జరిగితే టాలీవుడ్ తరపున బన్నీ మరో సరికొత్త రికార్డ్ ని సెట్ చేసినట్టే.

ఇక ఫ్యాన్స్ అయితే దంగల్ రికార్డ్ కూడా బ్రేక్ చేసేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన పుష్ప 2 సినిమా హిట్ సాంగ్స్ తో, యాక్షన్ సీక్వెన్స్ లతో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయి కలెక్షన్స్ తో హిట్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Anaganaga Oka Raju : ‘అన‌గ‌న‌గా ఒక రాజు’ టీజ‌ర్ రిలీజ్‌.. న‌వీన్ పొలిశెట్టి ఈస్ బ్యాక్‌..

ఇక సంధ్య థియేటర్ వివాదానికొస్తే.. మహిళ చనిపోగా, బాబు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు, సుకుమార్ 50 లక్షలు, నిర్మాతలు 50 లక్షలు పరిహారం కింద అందించారు. ప్రస్తుతం బన్నీ బెయిల్ పై బయట ఉండగా ఇటీవలే పోలీసులు విచారించారు. త్వరలోనే మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారిస్తారని తెలుస్తుంది. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ మీటింగ్ జరగడంతో ఈ మీటింగ్ లో బన్నీ ఇష్యూ గురించి ఏమైనా మాట్లాడరా అనేది తెలియాలి.