Pushpa 2 : ఓ వైపు అల్లు అర్జున్ వివాదం.. అయినా మరోవైపు పుష్ప 2 రికార్డులు.. లేటెస్ట్ రికార్డ్ ఏంటో తెలుసా?

ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో బోలెడన్ని రికార్డులు సాధించిన పుష్ప 2 తాజాగా మరో కొత్త రికార్డ్ సాధించింది.

Allu Arjun Pushpa 2 Movie Creates New Record event Controversies Happens

Pushpa 2 : గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనతో వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 సినిమా కూడా వివాదంలో పడింది. ఓ పక్క వివాదాలు నడుస్తున్నా పుష్ప హవా థియేటర్స్ లో తగ్గట్లేదు. ఇంకా రికార్డులు సాధిస్తూనే ఉంది. ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో బోలెడన్ని రికార్డులు సాధించిన పుష్ప 2 తాజాగా మరో కొత్త రికార్డ్ సాధించింది.

Also See : Game Changer : అమెరికా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు.. రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయిగా..

పుష్ప 2 సినిమా బుక్ మై షో యాప్ లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా లేనంతగా పుష్ప 2 సినిమాకు ఏకంగా 18 మిలియన్స్ కు పైగా బుక్ మై షోలో టికెట్స్ అమ్ముడుపోయాయి. అంటే ఆల్మోస్ట్ 1.8 కోట్ల టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో ఆన్లైన్ టికెట్ బుకింగ్ లో కూడా పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

ఈ బుక్ మై షో రికార్డుని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇంకా టికెట్స్ అమ్ముడుపోతూనే ఉన్నాయి. దీంతో ఈ కౌంట్ కూడా పెరగనుందని తెలుస్తుంది. ఇక కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. త్వరలోనే బాహుబలి రికార్డు 1800 కోట్లు దాటిస్తుందేమో చూడాలి.

ఇక మరో వైపు అల్లు అర్జున్ – సంధ్య థియేటర్ ఘటన రోజు రోజుకి మరింత జటిలం అవుతుంది. అల్లు అర్జున్ పై పలువురు రాజకీయ నాయకులు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి కూడా జరిగింది. తాజాగా మరోసారి పోలీసులు బన్నీకి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పినట్టు సమాచారం.