Pushpa 2 : అఫీషియ‌ల్‌.. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు.. పుష్ప 2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా మొదటి షో నుండే రికార్డు బ్రేక్ చేస్తుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం పుష్ప 2. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 5 గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ఈ మూవీ తాజాగా క‌లెక్ష‌న్ల‌లోనూ చ‌రిత్ర సృష్టిస్తోంది.

Alos Read : Yo Yo Honey Singh : స్టార్ రాప్ సింగర్ డాక్యూమెంటరీ.. ఎప్పుడు.. ఎందులో అంటే..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజున రూ.294 కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మైవీ మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో పుష్ప 2 మూవీ తొలి రోజున అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది. “ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అత్యధిక ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన సినిమా అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు పుష్ప 2 మేకర్స్. అంతేకాదు అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపారు”. ఇప్పటికే మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ లో RRR, బాహుబలి సినిమాలు ఉన్నాయి. RRR మొదటి రోజు 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చెయ్యగా, బాహుబలి 217 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాలో ఫహాఫ్ ఫాజిల్తో, అనసూయ, సునీల్ తో పాటు పలువురు కీలక పాత్రలో నటించారు. మరి పుష్ప 2 మొదటి రోజే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టింది అంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే అల్లు అర్జున్ కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది.