Rashmika Mandanna : పుష్ప 2 సినిమాకు రష్మిక మందన్న డిసెంబర్ సెంటిమెంట్ కలిసొస్తుందా?

తాజాగా పుష్ప 2 సినిమా విషయంలో ఓ సెంటిమెంట్ వినిపిస్తుంది.

Allu Arjun Pushpa 2 Movie gets Rashmika Mandanna December Sentiment

Rashmika Mandanna : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. గత మూడేళ్ళుగా ఎదురుచూసిన చూపులకు త్వరలోనే తెరపడనుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు.

తాజాగా ఈ సినిమా విషయంలో ఓ సెంటిమెంట్ వినిపిస్తుంది. రష్మిక మందన్న డిసెంబర్ సెంటిమెంట్ పుష్ప 2 సినిమాకు కలిసొస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు.

Also Read : Pushpa 2 Ticket Price : వామ్మో అక్కడ పుష్ప 2 టికెట్ రేట్ అంతా.. ఇక్కడే 1200 అంటే అక్కడ ఇంకా ఎక్కువే..

రష్మిక మందన్న మొదటి సినిమా కిరిక్ పార్టీ డిసెంబర్ లోనే రిలీజయి భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆమె చేసిన రెండు సినిమాలు అంజనీపుత్ర, చమక్ కూడా డిసెంబర్ లోనే రిలీజయి హిట్ అయ్యాయి. 2021 లో పుష్ప 1 సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజయి హిట్ అయింది. గత సంవత్సరం రష్మిక నటించిన యానిమల్ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజయి హిట్ అయింది. ఇలా రష్మిక నటించిన సినిమాల్లో డిసెంబర్లో రిలీజయిన ప్రతి సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు. పుష్ప 2 సినిమాకు రష్మిక డిసెంబర్ సెంటిమెట్ వర్కౌట్ అవుతుంది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.