Pushpa 2 : పాటల్లోనూ పుష్ప ప్రభంజనం.. అప్పుడలా.. ఇప్పుడిలా..

పుష్ప 1 సినిమలో సాంగ్స్ ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయో తెలిసిందే.

Allu Arjun Pushpa 2 movie songs getting record breaking views

Pushpa 2 : సినిమాపై సాంగ్స్ ఎంతటి ప్రభావం చూపుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా సక్సెస్ కి సాంగ్స్ కీలకం అని చెప్పొచ్చు. ఒక సినిమాలో పాటలతో ఆ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో కూడా చెప్పేస్తుంటారు ఆడియన్స్. అయితే ఈ విషయాన్ని పుష్ప సినిమా నిరూపించిందని చెప్పొచ్చు. పుష్ప 1 సినిమలో సాంగ్స్ ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయో తెలిసిందే. ఈ పాటలే దేవిశ్రీ ప్రసాద్ కి జాతీయ అవార్డు ను తెచ్చిపెట్టింది.

కాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది. దీనికి కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా యూట్యూబ్ లో దుమ్ములేపుతున్నాయి. మంచి రెస్పాన్స్ తో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఈ పాటలకి రచయిత చంద్రబోస్ లిరిక్స్ తోడవ్వడం మరింత ప్లస్ అయ్యింది. పార్ట్ 1,2 లకి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. అయితే పుష్ప సినిమాలోని అన్ని పాటలు ఇతర భాషల్లో కూడా మంచి వ్యూస్ అందుకున్నాయి.

Also Read : Pushpa 2 : పుష్ప ఈవెంట్ లో సుక్కు భార్య కంటతడి.. భర్త సక్సెస్ చూసి..

అన్ని భాషల్లో కలిపి 6 బిలియన్ కి పైగానే వ్యూస్ అందుకున్నాయి. ఈ విషయంలో అరుదైన రికార్డు బ్రేక్ చేసింది పుష్ప. ఇక ఈ సినిమాలో అత్యధిక వ్యూస్ రెండు పాటలు అందుకున్నాయి. మౌనికా యాదవ్‌ పాడిన ‘సామి సామి’కి 224+ మిలియన్‌, ఇంద్రవతి చౌహాన్‌ ఆలపించిన ‘ఊ అంటావా మావా’ 190+ మిలియన్ వ్యూస్‌ సాధించాయి. ఇప్పుడు పుష్ప 2 నుండి రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ తక్కువ టైం లో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అలా పుష్ప 1,2 లోని అన్ని సాంగ్స్ అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసాయి.