Allu Arjun Pushpa 2 Movie Wild Fire event in Hyderabad
Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కావడానికి రెడీ గా ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం భారీగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఈవెంట్స్ ను ముంబై, చెన్నై, పాట్నాతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో జరిపారు.
Also Read : పుష్ప 2 టికెట్స్ రేట్లు పెంచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..
అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా మాస్ జాతరను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లెవెల్ లో చేస్తున్నారు. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ చాలా పెద్దది కాబట్టి ఎక్కువ జనాలు రావచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ ను ఇక్కడ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.
After celebrating THE BIGGEST INDIAN FILM across the nation, it’s time to bring that euphoria home ❤🔥 #Pushpa2WildfireJAAthara in HYDERABAD on December 2nd from 6 PM onwards 💥💥
Venue : Police Grounds, Yousufguda #Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5thIcon Star… pic.twitter.com/JZWuR9rvru
— Pushpa (@PushpaMovie) November 30, 2024
ఇక ఈ సినిమా ఈవెంట్ కి పుష్ప 2 చిత్ర బృందం మొత్తం రానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఈవెంట్స్ ను ఇతర రాష్ట్రాల్లో చేశారు తప్ప తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించలేదు. కాగా ఇప్పుడు ఈ ఈవెంట్ ను పెద్ద ఎత్తున తెలుగు ఆడియన్స్ కోసం చేస్తున్నారు మేకర్స్. అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అందుకే హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా చేస్తున్నారు మేకర్స్.