Rajasaab : రాజాసాబ్ సినిమాకు షాక్.. ప్రేక్షకులకు ఊరట.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం..
టికెట్ల ధరల పెంపు మోమోపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. (Rajasaab)
Rajasaab
- నేడు రాజాసాబ్ రిలీజ్
- టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
- ఆ అనుమతులను కొట్టేసిన హైకోర్టు
Rajasaab : పెద్ద సినిమాలకు టికెట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీలో ఎంటువంటి సమస్య లేకపోయినా తెలంగాణలో మాత్రం పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రతిసారి టికెట్ రేట్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల తెలంగాణ హైకోర్టు టికెట్ రేట్లను పెంచొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది.(Rajasaab)
ఇటీవల అఖండ 2 రిలీజ్ సమయంలో కూడా టికెట్ రేట్ల పెంపు విషయంలో నిర్మాతలు ఇబ్బంది ఎదుర్కొని కోర్టు వరకు వెళ్లారు. తాజాగా రాజాసాబ్ విషయంలో ఇదే జరిగింది. రాజాసాబ్ సినిమాకు టికెట్ రేట్లను నిన్న రాత్రి పెంచుతూ మెమో జారీ చేసారు.
Also Read : Purushaha Teaser : ‘పురుష:’ టీజర్ రిలీజ్.. మొగుడు పెళ్ళాల గొడవలతో..
ఈ క్రమంలో రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ వేశారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్ లో సీపీ మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
టికెట్ల ధరల పెంపు మోమోపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని జీపీని ప్రశ్నించింది. టికెట్ల ధరలు పెంచమని సంబంధిత మంత్రి సైతం ప్రకటించినా సినిమాలకు ఎందుకు టికెట్ల ధరల పెంపును అనుమతిస్తూ మెమోలిస్తున్నారన్న ప్రశ్నించారు.
Also Read : The Raja Saab Review : ‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ.. హారర్ సినిమా అన్నారు.. కానీ..
దీంతో రాజాసాబ్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్లకే సినిమా టికెట్ రేట్లు వసూలు చేయాలని బుక్ మై షో కు ఆదేశాలు జారీ చేసి ఇకమీదట ఎలాంటి మెమొలు ఇవ్వద్దని మరోసారి స్పష్టం చేసింది హైకోర్టు. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే Go no 120 ప్రకారం 350 లోపే సినిమా టికెట్ ఉండాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.
దీంతో నేటి రాత్రి షోల నుంచే రాజాసాబ్ టికెట్ రేట్లు తెలంగాణలో మామూలుగానే ఉండబోతున్నాయి. ఇటీవల టికెట్ రేట్లు పెంచుతున్నారని ఫ్యాన్స్, ప్రేక్షకులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సంక్రాంతి హాలిడేస్ లో టికెట్ రేట్లు మామూలుగానే ఉండటంతో ప్రేక్షకులకు కాస్త ఊరట అని భావిస్తున్నారు.
