Rajasaab Collections :’రాజాసాబ్’ కలెక్షన్స్ కి బిగ్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఏ రికార్డ్ బ్రేక్ చేస్తాడో..

రాజాసాబ్ తో ప్రభాస్ ఏ రికార్డ్ బద్దలుకొడతాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. (Rajasaab Collections)

Rajasaab Collections :’రాజాసాబ్’ కలెక్షన్స్ కి బిగ్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఏ రికార్డ్ బ్రేక్ చేస్తాడో..

Rajasaab Collections

Updated On : January 9, 2026 / 6:40 PM IST
  • నేడు రాజాసాబ్ రిలీజ్
  • రాజాసాబ్ కలెక్షన్స్ కి ఎఫెక్ట్
  • మొదటి రోజు ఎన్ని కోట్లు వస్తాయి

Rajasaab Collections : మొదటిసారి ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో హారర్ కామెడీ జానర్ ట్రై చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రభాస్ గత సినిమాలకు ఉన్నంత భారీ హైప్ మాత్రం లేదు. ట్రైలర్ రిలీజ్ తర్వాత మరికాస్త అంచనాలు అయితే పెరిగాయి. స్టార్ హీరోల సినిమాలు వస్తే కలెక్షన్స్ గురించి, ఫస్ట్ డే ఓపెనింగ్స్ గురించి చర్చ కచ్చితంగా జరుగుతుంది.(Rajasaab Collections)

రాజాసాబ్ సినిమాకు ప్రీమియర్స్ అనౌన్స్ చేయడం, ఏపీలో టికెట్ రేట్లు పెంచడంతో, తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచుతారని వార్తలు రావడంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశించారు ఫ్యాన్స్. ప్రభాస్ సినిమా అంటేనే బాహుబలి తర్వాత నుంచి మొదటి రోజు కనీసం 100 కోట్ల పైనే ఉంటుంది. ప్రభాస్ చివరి సినిమా కల్కి మొదటి రోజు ఆల్మోస్ట్ 190 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సలార్ అయితే 178 కోట్లు వసూలు చేసింది. ఆదిపురుష్ 140 కోట్లు వసూలు చేసింది.

Also Read : Rajasaab : రాజాసాబ్ సినిమాకు షాక్.. ప్రేక్షకులకు ఊరట.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం..

మరి రాజాసాబ్ తో ప్రభాస్ ఏ రికార్డ్ బద్దలుకొడతాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే చివరి నిమిషంలో రాజాసాబ్ సినిమాకు దెబ్బ మీద దెబ్బ తగలడంతో కలెక్షన్స్ కి భారీ గండి పడేలా ఉంది అని ఫ్యాన్స్ వాపోతున్నారు.

Rajasaab Collections

ప్రీమియర్స్ అనౌన్స్ చేసినా తెలంగాణలో రాత్రి 11 వరకు షోలు పడలేదు. దీంతో ప్రీమియర్స్ కలెక్షన్స్ దాదాపు 5 నుంచి పది కోట్లు తగ్గినట్టే. ఇక ఏపీలో ప్రీమియర్స్ కి ఏకంగా 1000 రూపాయలు టికెట్ రేటు పెట్టారు. అసలే టికెట్ రేట్లు భారీగా ఉంటున్నాయని విమర్శలు వస్తుంటే ఏకంగా వెయ్యి రూపాయలు పెట్టడంతో ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అసలు ప్రీమియర్స్ అంటేనే ఫ్యాన్స్ వస్తారు. అలాంటి ఫ్యాన్స్ నుంచే దోచుకుంటున్నారని వ్యతిరేకత కూడా వస్తుంది.

దీంతో ఏపీలో ప్రీమియర్స్ కి అనుకున్న దానికంటే తక్కువే బుకింగ్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణలో రాత్రి 11 గంటలకు టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్స్ ఇచ్చారు. కానీ నేడు తెలంగాణ హైకోర్టు ఆ అనుమతులను కొట్టేసింది. దీంతో తెలంగాణలో నేడు రాత్రి ఆట నుంచి మాములు రేట్లకే రాజాసాబ్ సినిమా ప్రదర్శన జరగనుంది. దీంతో ఇంకాస్త కలెక్షన్స్ తగ్గుముఖం పట్టనున్నాయి.

Also Read : The Raja Saab Review : ‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ.. హారర్ సినిమా అన్నారు.. కానీ..

ఇక బాలీవుడ్ లో ప్రభాస్ సినిమా వచ్చిందంటే పనిగట్టుకొని మరీ కొంతమంది నెగిటివిటి చేస్తారని తెలిసిందే. అందుకు తగ్గట్టే రాజాసాబ్ సినిమాకు కావాలని ఒకటి, రెండు రేటింగ్స్ ఇచ్చాయి కొన్ని సోషల్ మీడియా, మీడియా పేజీలు. దీంతో బాలీవుడ్ లో సినిమాకు కాస్త ఎఫెక్ట్ అయ్యేలానే ఉంది. అలాగే టికెట్ బుకింగ్స్ ముందే ఆన్లైన్ ఓపెన్ చేస్తే భారీగా బుకింగ్స్ అయ్యేవి. కానీ తెలంగాణలో నేడు తెల్లవారు జాము వరకు కూడా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడంతో ఆన్లైన్ బుకింగ్స్ తగ్గాయి.

మొత్తంగా రాజాసాబ్ సినిమాకు మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ కి భారీ దెబ్బ పడుతుంది అంటున్నారు. కనీసం ఆదిపురుష్ 140 కోట్ల రికార్డ్ అయినా దాటుతుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజాసాబ్ మొదటి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లు వస్తాయో తెలియాలంటే రేపటి దాకా ఎదురుచూడాల్సిందే. అయితే టికెట్ రేటు తక్కువ ఉంటె ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి రేపట్నుంచి తెలంగాణలో భారీ బుకింగ్స్ అయి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక 12 నుంచి మరిన్ని సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లోనే రాజాసాబ్ లెక్కలు తేలాలి.