Pushpa 2 : పుష్ప 2 పోస్టుపోన్ వార్తలు పై క్లారిటీ.. ‘సింగం ఎగైన్’తో పోటీ..

'సింగం ఎగైన్' కూడా రిలీజ్ అవుతుండడంతో పుష్ప 2 పోస్టుపోన్ అయ్యిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత ఉంది..?

Allu Arjun Pushpa 2 postpone news clarification and Singham again release clarity

Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మొదటి భాగం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ అభిమానులంతా ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 పై భారీ అంచనాలు ఉండడంతో సుకుమార్ అండ్ టీం.. లేట్ అయినా నిదానంగా, ఆడియన్స్ అంచనాలను అందుకునేలా పర్ఫెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ మొత్తం 5 రోజులు సెలవులతో వస్తుంది వచ్చాయి. దీంతో పుష్ప 2కి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ విడుదల తేదీ నిర్ణయం పట్ల అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆ డేట్ కి రావడం లేదని, పోస్టుపోన్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సింగం ఎగైన్’ని కూడా అదే సమయంలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో పుష్ప తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఎటువంటి నిజం లేదని, పుష్ప 2 ఆగష్టు 15కే వస్తుందని.. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఆగష్టులో పుష్ప 2, సింగం ఎగైన్ బాక్స్ ఆఫీస్ ఫైట్ ఉండబోతుందని తెలియజేశారు.

Also read : Mahesh Babu : సుదర్శన్ థియేటర్‌ ప్రీమియర్‌కి మహేష్ బాబు వస్తున్నాడా..?

రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న సింగం ఎగైన్.. బాలీవుడ్ కాప్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ మెయిన్ హీరోగా నటిస్తుంటే రణవీర్ సింగ్, దీపికా పదుకొనె స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ క్యాస్ట్ తో వస్తున్న ఈ మూవీ వల్ల.. బాలీవుడ్ మార్కెట్ లో పుష్ప కలెక్షన్స్ కి కొంచెం ఇబ్బంది కలగడం ఖాయంగా కనిపిస్తుంది. మరి పుష్ప తన రూల్ ఎలా చేస్తాడో చూడాలి.