Mahesh Babu : సుదర్శన్ థియేటర్‌ ప్రీమియర్‌కి మహేష్ బాబు వస్తున్నాడా..?

తన ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ లో గుంటూరు కారం ప్రీమియర్‌ చూసేందుకు మహేష్ బాబు వస్తున్నాడా..?

Mahesh Babu : సుదర్శన్ థియేటర్‌ ప్రీమియర్‌కి మహేష్ బాబు వస్తున్నాడా..?

mahesh babu is really coming to sudarshan theatre to watch guntur kaaram

Updated On : January 11, 2024 / 6:23 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మ‌హేశ్ పూర్తి మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో, అత్యధిక షోలతో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో మహేష్ బాబు ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే రికార్డులు సెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

కాగా నైజం అభిమానులకు మహేష్ బాబు సినిమా అంటే హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌ లోనే చూడాలని అనుకుంటారు. అక్కడ మహేష్ సినిమాకి జరిగే సెలబ్రేషన్స్ మరెక్కడా కనిపించవు. అందుకే ఆ సెలబ్రేషన్స్ చూడడానికి మహేష్ బాబు ఫ్యామిలీ కూడా పలు మూవీ రిలీజ్‌లకు అక్కడికి వచ్చి అభిమానులతో సినిమా ఎంజాయ్ చేస్తారు. ఇక రేపు రిలీజ్ కాబోతున్న గుంటూరు కారంని చూడడానికి కూడా ఘట్టమనేని ఫ్యామిలీ రాబోతుందట.

ఈసారి ఏకంగా సూపర్ స్టారే రాబోతున్నట్లు మహేష్ టీంకి చెందిన పిఆర్.. సందేహం వ్యక్తం చేస్తూ ట్వీట్ వేసాడు. ఈరోజు అర్ధరాత్రి పడబోయే ప్రీమియర్ కి మహేష్ బాబు కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మహేష్ నిజంగానే వస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త అయితే నెట్టింట వైరల్ గా మారింది.

Also read : HanuMan : హనుమాన్ హిందీ ప్రీమియర్ షోల రిపోర్ట్ వచ్చేసింది.. బ్లాక్‌బస్టర్ లోడింగ్ అంటూ రివ్యూ..

కాగా ఈ మూవీకి తెలంగాణ, ఏపీ గవర్నమెంట్స్ టికెట్ల ధ‌ర‌లు పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది. తెలంగాణలో సింగిల్ స్రీన్స్‌కి రూ.65, మ‌ల్టీఫెక్స్‌ల‌కి రూ.100 టికెట్స్ రేట్స్ పెంచారు. రాష్ట్రంలో 23 చోట్ల 12వ తేదీ అర్థ‌రాత్రి 1 గంట షోకు, అలాగే 12 నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 4 గంట‌ల‌కు షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. అలాగే ఏపీ గవర్నమెంట్ టికెట్ ధర పై రూ.50 పెంచుకునేందుకు వెసులు బాటు కల్పిస్తూ జీవోను జారీ చేసింది.