HanuMan : హనుమాన్ హిందీ ప్రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది.. బ్లాక్‌బస్టర్ లోడింగ్ అంటూ రివ్యూ..

హనుమాన్ హిందీ ప్రీమియర్ షోల రిపోర్ట్ వచ్చేసింది. డ్రామా, ఎమోషన్స్, యాక్షన్, విఎఫ్‌ఎక్స్..

HanuMan : హనుమాన్ హిందీ ప్రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది.. బ్లాక్‌బస్టర్ లోడింగ్ అంటూ రివ్యూ..

Teja sajja hanuman movie hindi premier movie review report

Updated On : January 11, 2024 / 6:25 PM IST

HanuMan : ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం టీజర్ అండ్ ట్రైలర్ ఇప్పటికే ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌ని ఈ చిత్రం బాగా ఆకర్షిస్తుంది. మూవీ టీం కూడా హిందీ మార్కెట్‌నే టార్గెట్ చేసింది. దీంతో బాలీవుడ్‌లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి.

తాజాగా ఈ మూవీ మొదటి ప్రివ్యూ కూడా అక్కడే పడింది. ఇక ఈ ప్రివ్యూ చూసిన ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన రివ్యూని ఇచ్చేశారు. ప్రశాంత్ వర్మ ఓ సాలిడ్ ఎంటర్టైనర్‌ని సిద్ధం చేశారని పేర్కొన్నారు. డ్రామా, ఎమోషన్స్, యాక్షన్, విఎఫ్‌ఎక్స్, అలాగే హిందూ మైథాలజిని చాలా బాగా డీల్ చేశారని వెల్లడించారు. గూస్‌బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయని, ఎండింగ్ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు.

Also read : ప్రభాస్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. కల్కి టీజర్ రాబోతుందట.. సర్టిఫికేషన్ కూడా పూర్తి..

తేజ సజ్జ తన పాత్రని చాలా చక్కగా చేశారని, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిశోర్ తమ పాత్రలకి న్యాయం చేసినట్లు పేర్కొన్నారు. VFX మూవీకి మెయిన్ హైలైట్ గా నిలిచినట్లు వెల్లడించారు. కథ, పాత్రల డబ్బింగ్ అన్ని బాగున్నాయని, కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే కొంచెం ల్యాగ్ సీన్స్ తో అప్పుడప్పుడు బోర్ అనిపిస్తుందని పేర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో కొన్ని గంటల్లో ప్రివ్యూస్ పడబోతున్నాయి.

అయితే నార్త్‌లో ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూ రావడంతో మూవీ టీం హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ కొంచెం హిట్ టాక్ వస్తే చాలు మూవీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నట్లే. గతంలో కార్తికేయ 2 సినిమా కూడా చిన్న చిత్రంగా వచ్చి బాలీవుడ్ మార్కెట్‌లో పెద్ద హిట్టుని అందుకుంది. మరి హనుమాన్ ఏం చేస్తాడో చూడాలి.