Allu Arjun Pushpa 2 Releasing in Tamilnadu in Grand Way with New Record
Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఇటీవల పాట్నాలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేయగా నిన్న చెన్నై లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు. పుష్ప 2 సినిమాకు ఉన్న క్రేజ్ తో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. తాజాగా నిన్నచెన్నై ఈవెంట్లో అక్కడి డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అర్చన కల్పాతి మాట్లాడుతూ పుష్ప 2 సినిమాను తమిళనాడులో ఏ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారో తెలిపారు.
Also Read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
చెన్నై ఈవెంట్లో ఏజెఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత, పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్ అర్చన కల్పాతి మాట్లాడుతూ.. మా ఏజిఎస్ ను నమ్మి ఇంత గొప్ప సినిమా మాకు ఇచ్చినందుకుగాను మైత్రి నవీన్ గారికి, రవి గారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద సినిమాను తమిళనాడులో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాము. సుమారు 600 లొకేషన్స్ లో 800 స్క్రీన్స్ లో పుష్ప 2 సినిమాను విడుదల చేయబోతున్నాము. మొదటి రోజున ఆల్మోస్ట్ 3500 షోలు వేయనున్నాము. నాకు దర్శకుడు సుకుమార్ గారు అంటే ఎంతో అభిమానం. ఆయన సినిమాలు, వాటిలో ఆయన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసే విధానం నాకు నచ్చుతుంది. మా సబ్ డిస్ట్రిబ్యూటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్ హెడ్లకు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాని తప్పకుండా చూడండి అని అన్నారు.
"We are releasing #Pushpa2TheRule in 600 locations, across 800 screens, with 3500 shows on DAY 1."
– Tamilnadu Distributor, #ArchanaKalapathi. pic.twitter.com/XO5dRCZaZR
— Gulte (@GulteOfficial) November 24, 2024
దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తెలుగు సినిమాలను, తమిళ్ తప్ప వేరే భాష సినిమాలను తమిళ్ లో అంతగా పట్టించుకోరు. అక్కడ వేరే భాష సినిమా రిలీజ్ అయితేనే గొప్ప కానీ పుష్ప 2 సినిమాని ఈ రేంజ్ లో భారీగా రిలీజ్ చేయడం అంటే మాములు విషయం కాదు. మరి ఇప్పటివరకు ఏ స్టార్ హీరో రిలీజ్ చేయని లెవల్లో పుష్ప 2 సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. కలెక్షన్స్ విషయంలో కూడా బన్నీ తమిళనాడులో సరికొత్త రికార్డ్ సృష్టిస్తాడేమో చూడాలి.