Allu Arjun Rajamouli Devisri Prasad RRR receiving 69 National Film Awards
National Film Awards : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఇటీవల కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021లో సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలకు ఈ అవార్డ్స్ ప్రకటించారు. ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్, యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల పురస్కారం వేడుక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా మొదలయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా విజేతలు అందరూ తమ అవార్డులను అందుకున్నారు.
Also read : Prabhas : ప్రభాస్ పెళ్లికి టైం ఫిక్స్ చేసుకున్నాము.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ఈ ఏడాది టాలీవుడ్ కి నేషనల్ అవార్డుల పంట పండింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ‘ఉప్పెన’, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ‘RRR’, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ‘పురుషోత్తమ చార్యులు’, బెస్ట్ యాక్టర్ ‘అల్లు అర్జున్’, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ (పుష్ప సాంగ్స్), కీరవాణి (RRR బ్యాక్‌గ్రౌండ్ స్కోర్), ఉత్తమ గాయకుడు ‘కాలభైరవ (కొమరం భీముడో – RRR)’ బెస్ట్ లిరిక్స్ ‘చంద్రబోస్ (కొండపోలం మూవీ)’, బెస్ట్ స్టంట్ మాస్టర్ ‘కింగ్ సోలొమాన్ (RRR)’ బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ ‘ప్రేమ్ రక్షిత్ (RRR)’, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ‘వి శ్రీనివాస్ మోహన్ (RRR)’.. ఎంపికయ్యారు. నేడు వీరంతా ఈ అవార్డులను అందుకున్నారు.