Pushpa Song Update : పుష్ప రెండో సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. శ్రీవల్లి పాట ఎప్పుడంటే..?

పుష్ప సినిమా రెండో సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది.

Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Movie Second Song Update

Pushpa Song Update : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో పాటు సాంగ్స్, అల్లు అర్జున్ మేనరిజమ్స్ బాగా వైరల్ అయ్యాయి. ఏకంగా నేషనల్ అవార్డు సాధించాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read : RGV : తమిళ్ స్టార్‌తో ఆర్జీవీ భేటీ.. సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా బ్రో..

ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేసారు. మొదటి సాంగ్ పుష్ప పుష్ప.. సాంగ్ తో పాటు, స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప సినిమా రెండో సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది. తాజాగా పుష్ప సినిమా నుంచి రెండో పాట అప్డేట్ ఇచ్చారు. రెండో పాట అనౌన్స్‌మెంట్ వీడియో రేపు మే 23న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. శ్రీవల్లి సాంగ్ అని చెప్పడంతో రష్మిక మందన్న బన్నీ కోసం పాడిన పాట అని తెలుస్తుంది.

దీంతో బన్నీ అభిమానులతో పాటు రష్మిక అభిమానులు కూడా ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ, రష్మిక, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్.. లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని ఆల్రెడీ ప్రకటించారు.