Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ సెట్స్ నుంచి వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్..

నిన్న సంథింగ్ స్పెషల్ అంటూ పోస్ట్ వేసిన అల్లు అర్జున్.. ఈరోజు ఆ స్పెషల్ పోస్ట్ ని షేర్ చేశాడు.

Allu Arjun share video from Pushpa 2 locations

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన ‘పుష్ప-1’ (Pushpa 1) బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పార్ట్-1 రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి అవ్వుతున్నాయి. ఇక ఇటీవల ఈ మూవీకి గాను జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డుని, దేవిశ్రీప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నారు. దీంతో సీక్వెల్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ క్రేజ్ ని మూవీ టీం కూడా తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోబోతున్నారు.

NTR Rs 100 Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం కొనుగోలుకు ఆసక్తి చూపిన అభిమానులు.. తొలిరోజు ఎన్ని నాణేలు విక్రయాలు జరిగాయంటే..

అల్లు అర్జున్ నిన్న సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. “రేపు ఉదయం 9 గంటలకు సంథింగ్ స్పెషల్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆ సంథింగ్ స్పెషల్ ఏంటని ఆశగా ఎదురు చూశారు. తాజాగా బన్నీ ఆ స్పెషల్ పోస్ట్ ని షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో బన్నీ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.

Bedurulanka 2012 : చాలా ఏళ్ళ తరువాత ‘బెదురులంక’తో ఆ మాట విన్న కార్తికేయ.. ఏంటి ఆ మాట..?

కాగా పార్ట్ 1 మ్యూజిక్ కి నేషనల్ అవార్డు రావడంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ పై కూడా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యం ఐటెం సాంగ్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ ఇండియా మొత్తాన్ని ఎలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు