Allu Arjun : నేను దేనికి పనికిరాని అనుకోని 10 లక్షలు ఇచ్చారు మా తాత..
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''నేను 16 ఏళ్లు వచ్చే వరకు తాతయ్య, నానమ్మలతోనే ఎక్కువగా ఉన్నాను. తాతయ్య చనిపోయిన తర్వాత నా పేరు మీద రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్..................
- Saketh U
- Published On : October 2, 2022 / 06:03 PM IST
Allu Arjun shares his grand father memory
Allu Arjun : ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం, ఆయనకు ఘన నివాళుల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీగా జరిగింది. అల్లు ఫ్యామిలీ నిర్వహించిన ఈ వేడుకకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్, బ్రహ్మానందం, అలీ, రాజేంద్రప్రసాద్.. లాంటి చాలా మంది సినీ నటులు, ప్రముఖులు అతిధులుగా విచ్చేశారు.
ఈ వేడుకలో అల్లురామలింగయ్య మనవడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”నేను 16 ఏళ్లు వచ్చే వరకు తాతయ్య, నానమ్మలతోనే ఎక్కువగా ఉన్నాను. తాతయ్య చనిపోయిన తర్వాత నా పేరు మీద రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ డబ్బు వచ్చింది. ఆయన ఎందుకు నాకు మాత్రమే ఇలా డబ్బులిచ్చారు అని ఆలోచించాను. ఆ తర్వాత అర్థమైంది. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఆ డబ్బుని జమ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు నేను జీవితంలో ఎందుకూ పనికిరాడు అనుకోని మా తాతయ్య భావించి నా కోసం ఈ 10.లక్షలు వచ్చేలా చేశారు. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన కూడా నా ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేది అని ఒక చిన్న బాధ ఉంది’’ అని తెలిపారు.
