Chiranjeevi : బలివ్వడానికి గొర్రెను తీసుకువెళ్లినట్టు పెళ్లికి సిద్ధం చేశారు.. చిరిగిన షర్ట్‌తోనే సురేఖకి తాళి కట్టా..

చిరంజీవి తన పెళ్లి విశేషాలని గుర్తు చేసుకుంటూ.. ''మనవూరి పాండవులు సినిమా సమయంలో మేమిద్దరం మొదటిసారి కలిశాం. అప్పుడు అల్లు రామలింగయ్య గారిని చూసి ఈయనేంటి...............

Chiranjeevi : బలివ్వడానికి గొర్రెను తీసుకువెళ్లినట్టు పెళ్లికి సిద్ధం చేశారు.. చిరిగిన షర్ట్‌తోనే సురేఖకి తాళి కట్టా..

Chiranjeevi shares his marriage story

Chiranjeevi :  ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం, ఆయనకు ఘన నివాళుల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీగా జరిగింది. అల్లు ఫ్యామిలీ నిర్వహించిన ఈ వేడుకకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్, బ్రహ్మానందం, అలీ, రాజేంద్రప్రసాద్.. లాంటి చాలా మంది సినీ నటులు, ప్రముఖులు అతిధులుగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ అల్లు రామలింగయ్య గారి గొప్పతనాన్ని, ఆయనతో తనకున్న అనుబంధం గురించి తెలిపారు. అలాగే ఆయనకి అల్లుడిగా ఎలా అయ్యారు, సురేఖతో పెళ్లి ఎలా అయింది అంటూ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలని తెలిపారు.

Chiranjeevi : రాజమౌళితో నేను సినిమా చేయను.. నేనే దర్శకుడిగా మారుతాను..

చిరంజీవి తన పెళ్లి విశేషాలని గుర్తు చేసుకుంటూ.. ”మనవూరి పాండవులు సినిమా సమయంలో మేమిద్దరం మొదటిసారి కలిశాం. అప్పుడు అల్లు రామలింగయ్య గారిని చూసి ఈయనేంటి ఇంత సీరియస్‌గా ఉన్నారు అనుకున్నాను. ఆ రోజు షూటింగ్ పూర్తయ్యాక.. బాబు నీ పేరేంటి? మీ ఊరు ఎక్కడ? అని వివరాలు అడిగారు. ఆ రోజు నుంచి ఆయన దృష్టి నాపైనే ఎక్కువగా ఉండేది. ఆయన నన్నెందుకు అంతలా గమనించారో ఆ తర్వాత తెలిసింది. ఆయనతో పాటే అరవింద్‌, ‘మనవూరి పాండవులు’ నిర్మాత జయకృష్ణ కూడా కలిశారు. వీళ్లంతా కలిసి నన్ను ఎలాగైనా సురేఖకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. నా ప్రమేయం లేకుండానే ఓసారి జయకృష్ణ మా ఇంటికి వెళ్లి పెళ్లి గురించి నాన్నతో మాట్లాడారు.”

”వీళ్ళు మాట్లాడిన దానికి మా నాన్న కూడా పెళ్లి చేసేయడానికి ఫిక్స్‌ అయ్యారు. (నవ్వుతూ) వీళ్లంతా కలిసి బలివ్వడానికి గొర్రెను తీసుకువెళ్లినట్టు నన్ను పెళ్లికి సిద్ధం చేశారు. పెళ్లి చూపుల తర్వాత ఓసారి మామయ్య ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్లాను. మొదటిసారి సురేఖ పెట్టిన కాఫీ తాగాను. ఆ రోజే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఓకే అని చెప్పాను. నా పెళ్లి సమయంలో వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నాను. షూటింగ్‌ల మధ్య బ్రేక్‌ తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాను. చిరిగిన షర్ట్‌తోనే సురేఖ మెడలో తాళి కట్టాను. ఆ రోజు అల్లు రామలింగయ్య గారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది’’ అని తన పెళ్లి స్టోరీ గురించి అందరికి తెలిపారు.