Chiranjeevi : రాజమౌళితో నేను సినిమా చేయను.. నేనే దర్శకుడిగా మారుతాను..

చిరంజీవి మాట్లాడుతూ.. ''రాజమౌళి చాలా గొప్ప దర్శకుడు. భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు. అయన ఒక నటుడి నుంచి కోరుకునే ఔట్‌పుట్‌ని...........

Chiranjeevi : రాజమౌళితో నేను సినిమా చేయను.. నేనే దర్శకుడిగా మారుతాను..

Chiranjeevi :  మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగు గాడ్‌ఫాదర్‌ గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించగా నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 5న గాడ్ ఫాదర్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

 

హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తుండటంతో హిందీలో కూడా ప్రమోషన్స్ భారీగానే నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి టాలీవుడ్ నుంచి స్టార్ గా ఎదిగారు. మీరు టాలీవుడ్ లో మెగాస్టార్, మరి మీరు ఆయనతో సినిమా ఎప్పుడు చేస్తారు అని యాంకర్ అడగగా చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Meena : తనని చూస్తుంటే అసూయ కలుగుతుంది.. నా డ్రీమ్ క్యారెక్టర్ కొట్టేసింది..

చిరంజీవి మాట్లాడుతూ.. ”రాజమౌళి చాలా గొప్ప దర్శకుడు. భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు. అయన ఒక నటుడి నుంచి కోరుకునే ఔట్‌పుట్‌ని నేను ఇవ్వగలనో లేదో అని సందేహం. అంతేకాక రాజమౌళి ఒక సినిమాకు ఎంత టైం తీసుకుంటాడో మీకు తెలిసిందే. ఇప్పుడు ఆయన సినిమా కోసం నేను, నాకున్న ఏజ్ కి మూడు, నాలుగేళ్లు కేటాయించలేను. ఇప్పుడు నేను ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాను. రాజమౌళితో సినిమా ఒప్పుకుంటే అది కుదరదు. అందుకే రాజమౌళితో వర్క్ చేయలేను. అలాగే భవిష్యత్తులో నాకు దర్శకత్వం చేసే ఆలోచనలు ఉన్నాయి” అని తెలిపారు. దీంతో రాజమౌళితో సినిమా చేయను అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.