Meena : తనని చూస్తుంటే అసూయ కలుగుతుంది.. నా డ్రీమ్ క్యారెక్టర్ కొట్టేసింది..

పొన్నియిన్ సెల్వన్ లోని ఐశ్వర్యారాయ్‌ క్యారెక్టర్ నందిని పాత్ర ఫోటోని షేర్ చేసి.. ''ఈ సినిమాలో నా డ్రీమ్‌ క్యారెక్టర్‌ నందిని పాత్రని కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూసి నాకు అసూయ కలిగింది. నేను జీవితంలో.............

Meena : తనని చూస్తుంటే అసూయ కలుగుతుంది.. నా డ్రీమ్ క్యారెక్టర్ కొట్టేసింది..

Meena jealous abou aishwrya rai charcter in Ponniyin Selvan 1

Updated On : October 2, 2022 / 11:54 AM IST

Meena :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి ఎంతోమంది స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ కి ముందునుంచే భారీగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.

ఈ సినిమా పక్క తమిళ స్టోరీ కావడంతో తమిళ్ లో భారీ విజయం సాధించినా వేరే భాషల్లో మాత్రం నిరాశనే మిగిల్చింది. ఈ సినిమాపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ పాత్ర గురించి నటి మీనా తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

BiggBoss Shrihan : హీరోగా మారుతున్న బిగ్‌బాస్ శ్రీహాన్.. ఆవారా జిందగి అంటూ..

పొన్నియిన్ సెల్వన్ లోని ఐశ్వర్యారాయ్‌ క్యారెక్టర్ నందిని పాత్ర ఫోటోని షేర్ చేసి.. ”ఈ సినిమాలో నా డ్రీమ్‌ క్యారెక్టర్‌ నందిని పాత్రని కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూసి నాకు అసూయ కలిగింది. నేను జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారి. ఆమె అందానికి కూడా నేను ఫిదా అయిపోయాను. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించిన నటీనటులందరికీ అభినందనలు” అని మీనా పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)