Allu Arjun : గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు..

వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం అల్లు అర్జున్‌ను గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Allu Arjun Shifted to Gandhi Hospital

ప్ర‌ముఖ సినీ న‌టుడు అల్లు అర్జున్‌ను చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట కేసులో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. డిసెంబ‌ర్ 4న ‘పుష్ప2’ ప్రీమియ‌ర్ షో సంద‌ర్బంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్‌కు ప‌రిమితికి మంచి ప్రేక్ష‌కులు రావ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌గా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

ఈ ఘటనకు సంబంధించి బ‌న్నీపై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Allu Arjun Arrested: ఇదే లాజిక్ రేవంత్ రెడ్డికి వర్తించదా..? అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ ట్వీట్

చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అక్క‌డ అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను న‌మోదు చేశారు. సెంట్ర‌ల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న్ను విచారించారు. ఆ త‌రువాత వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఆ త‌రువాత నాంప‌ల్లి కోర్టుకు తీసుకువెళ్లి న్యాయ‌మూర్తి ముందు హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

Mohan Babu : మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు.. నివాసంలో లేని డైలాగ్ కింగ్‌..!