Allu Ayaan
Allu Ayaan : అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అయాన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అయాన్ ఎప్పుడు కనపడినా సరదాగా ఏదో ఒక పని చేసి, ఏదో మాట్లాడి అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వైరల్ అవుతుంటాడు. అల్లు అయాన్ కనిపించాడు అంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. సోషల్ మీడియాలో అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని ఫ్యాన్స్ సరదాగా పిలుచుకుంటారు.(Allu Ayaan)
తాజాగా అయాన్ మరోసారి వైరల్ అవుతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీ దగ్గర అయాన్ క్రిస్మస్ సాంగ్ కి రీల్ చేసాడు. ఈ వీడియోని బన్నీ భార్య స్నేహ రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది అయాన్ సరదాగా క్యూట్ గా చేసిన ఈ రీల్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మోడల్ అయ్యాను మళ్ళీ వచ్చేసాడు అంటూ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read : Shagna sri venun : దర్శకురాలిగా మారుతున్న హీరోయిన్.. వరుణ్ సందేశ్ తో సినిమా అనౌన్స్..
అల్లు అయాన్ చేసిన క్రిస్మస్ రీల్ మీరు కూడా చూసేయండి..