Pushpa 2 Song : పుష్ప ఐటెం సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. శ్రీలీల ‘కిస్సిక్’ సాంగ్..

తాజాగా పుష్ప 2 లోని ఈ కిస్సిక్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.

Allu Arjun Sreeleela Pushpa 2 Movie Special Kissik Song Update Announced

Pushpa 2 Song : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు దేశమంతా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో ఘనంగా చేసి పుష్ప 2 హైప్ మరింత పెంచారు. తాజాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.

గతంలో పుష్ప 1 సినిమాలో సమంత ‘ఊ అంటావా ఊ ఊ అంటావా..’ సాంగ్ తో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో శ్రీలీల అల్లు అర్జున్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనుంది. ఆల్రెడీ శ్రీలీల పోస్టర్ తో కిస్సిక్ సాంగ్ అంటూ ఇటీవల అనౌన్స్ చేసారు. తాజాగా పుష్ప 2 లోని ఈ కిస్సిక్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ నవంబర్ 24 న సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

 

దీంతో బన్నీ ఫ్యాన్స్, శ్రీలీల ఫ్యాన్స్ ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. సుకుమార్ – దేవిశ్రీ కాంబినేషన్లో ఐటెం సాంగ్ అంటే అదిరిపోతుంది. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో, బన్నీ – శ్రీలీల కలిసి ఏ రేంజ్ లో డ్యాన్స్ చేసారో చూడాలి.