అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నసినిమా మే 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. తర్వాత సుకుమార్, ఓ మైఫ్రెండ్, MCA సినిమాల దర్శకుడు వేణు శ్రీరామ్‌తో సినిమాలు లైన్‌లో పెట్టాడు బన్నీ. సుకుమార్ ముందుగా మహేష్ బాబుతో సినిమా చెయ్యాల్సింది కానీ, ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆర్య, ఆర్య-2 తర్వాత సుక్కు, బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ సినిమాని మే 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని తెలుస్తుంది.
త్రివిక్రమ్, సుకుమార్ ఇద్దరితోనూ ముచ్చటగా మూడవసారి కలిసి పనిచేస్తున్నాడు అల్లు అర్జున్. రంగస్థలం తర్వాత మైత్రీ బ్యానర్‌లో సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకి మైత్రీ సంస్థతో కలిసి నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నాడు సుకుమార్.