Allu Arjun Sukumar Pushpa 2 Movie Teaser Update
Pushpa 2 : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా కోసం అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప ది రూల్’ పేరుతో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా పుష్ప 2 టీజర్ అప్డేట్ వినిపిస్తుంది. బన్నీ ఫ్యాన్స్ పుష్ప అప్డేట్ గురించి సోషల్ మీడియాలో అడుగుతూనే ఉన్నారు. తాజాగా పలువురు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ ని సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో అతను పుష్ప అప్డేట్ ఇచ్చాడు. పుష్ప టీజర్ బర్త్ డేకి వస్తుంది అని రిప్లై ఇచ్చాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రాబోతుందని సమాచారం. దీంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. పుష్ప హిట్ అవ్వడం, నేషనల్ అవార్డు రావడం, పాన్ ఇండియా వైడ్ గుర్తింపు రావడం, మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం పెట్టడం, సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ రావడం.. ఇలా బన్నీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. పుష్ప రిలీజయిన దగ్గర్నుంచి బన్నీకి బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం పుష్ప 2 రిలీజ్ కూడా ఉండటంతో రాబోయే అల్లు అర్జున్ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులు రెడీ అవుతున్నారు.
Teaser untundi birthday ki…Fix
— Sarath Chandra Naidu (@imsarathchandra) March 29, 2024