Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్.. అనుకున్నట్టే రాధికా సినిమాటిక్ యూనివర్స్?

టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నేహా శెట్టి నటించింది.

Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్.. అనుకున్నట్టే రాధికా సినిమాటిక్ యూనివర్స్?

DJ Tillu Tillu Square Movies Creates Radhika Cinematic Universe Rumours goes Viral

Updated On : March 29, 2024 / 1:01 PM IST

Tillu Square Movie : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) సూపర్ హిట్ సినిమా ‘డీజే టిల్లు'(DJ Tillu)కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా నేడు మార్చి 29న థియేటర్స్ లో రిలీజయింది. ఉదయం ఆట నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది ఈ సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

అయితే టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నేహా శెట్టి నటించింది. టిల్లు స్క్వేర్ సినిమా వస్తున్నప్పుడు నేహా శెట్టి పాత్ర మళ్ళీ గెస్ట్ అప్పీరెన్స్ వస్తుంది, ఆ సినిమాకు, ఈ సినిమాకు లింక్ ఇస్తారు, రాధిక సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తారని వార్తలు వచ్చాయి. అనుకున్నట్టు అదే జరిగింది.

మొదటి పార్ట్ లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి(Neha Shetty) టిల్లు స్క్వేర్ సినిమా సెకండ్ హాఫ్ లో అదే రాధిక పాత్రని కంటిన్యూ చేస్తూ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. నేహా శెట్టి సినిమాలో కనిపించగానే థియేటర్స్ లో అరుపులు, విజిల్స్ తో ప్రేక్షకులు హడావిడి చేసారు. అయితే టిల్లు స్క్వేర్ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) టిల్లు స్క్వేర్ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. ట్యాక్సీవాలా, SR కల్యాణమండపం సినిమాలతో హిట్స్ కొట్టినా ప్రియాంక జవాల్కర్ కి అనుకున్నంతగా అవకాశాలు రావట్లేదు. ఈ టిల్లు స్క్వేర్ గెస్ట్ అప్పీరెన్స్ తో అయినా మళ్ళీ అవకాశాలు వస్తాయేమో చూడాలి. అయితే నెక్స్ట్ రాబోయే టిల్లు సినిమాలో ప్రియాంక నటిస్తుందని టాక్ కూడా వినిపిస్తుంది.

Also Read : ‘టిల్లు స్క్వేర్’ మూవీ రివ్యూ.. ‘డీజే టిల్లు’ని మించి ఉందా?.. సిద్ధూ, అనుపమ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?

డీజే టిల్లులోని నేహా శెట్టి టిల్లు స్క్వేర్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. అలాగే నెక్స్ట్ రాబోయే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తుందని, ప్రియాంకని ముందే గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించారని.. ఇలా హీరోయిన్స్ నెక్స్ట్ సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పిస్తూ రాధికా సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల అందరూ సినిమాటిక్ యూనివర్స్ లు ప్లాన్ చేస్తూ తమ సినిమాలపై అంచనాలు పెంచుతున్నారు. సిద్ధూ కూడా ఇవి కంటిన్యూగా నాలుగైదు టిల్లు సినిమాలు ఉండొచ్చు అని ఆల్రెడీ తెలిపారు. దీంతో సిద్ధూ నిజంగానే రాధిక సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తున్నాడా అని అభిమానులు రాబోయే టిల్లు సినిమాల కోసం ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు.