Pushpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్..

మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి..

Allu Arjun Sukumar Rashmika Mandanna Pushpa 2 Movie Trailer Released

Pushpa 2 Trailer : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాంగ్స్, అల్లు అర్జున్ మేనరిజమ్స్ అయితే వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యాయి. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ కూడా రావడంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి అంచనాలను పెంచారు.

తాజాగా నేడు పుష్ప 2 ట్రైలర్ ను రిలీజ్ చేసారు. బీహార్ పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించి పుష్ప 2 ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి..

ఇక ట్రైలర్ చూస్తుంటే పుష్ప నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కి ఎదిగినట్టు చూపించాడు. అలాగే శ్రీవల్లితో పెళ్లి, పెళ్లి తర్వాత సీన్స్, షెకావత్ తో విబేధాలు, ఐటెం సాంగ్.. ఇలా అన్ని చూపించారు. ఇక చివర్లో అందరూ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటే కాదు వైల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ చెప్పి అదరగొట్టాడు. అలాగే.. నాకు కావాల్సింది అణా అయినా అర్ధణా అయినా అది ఏడు కొండల మీద ఉన్నా ఏడు సముద్రాల దాటి ఉన్నా పోయి తెచ్చుకునేదే పుష్ప గాడి అలవాటు అంటూ అల్లు అర్జున్ డైలాగ్ అదరగొట్టాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అదిరిపోయే షాట్స్, యాక్షన్ సీక్వెన్స్ లు, డైలాగ్స్ చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఇక ట్రైలర్ లోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. నేడు ట్రైలర్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ యూనిట్ త్వరలో మరో ఆరు నగరాల్లో భారీగా పుష్ప ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ 1000 కోట్ల కలెక్షన్స్ లిస్ట్ లోకి ఎంటర్ అవుతాడని అంతా భావిస్తున్నారు. నార్త్ లో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది అని నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో మరోసారి ప్రూవ్ అయింది.