Allu Arjun to Sandhya Theater once again
Pushpa 2 Stampede Row : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంధ్య థియేటర్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో తెలిసిందే. ఇప్పటికే ఈ విషయానికి గాను అల్లు అర్జున్ ను అరెస్ట్ కూడా చేసారు. అనంతరం బెయిల్ పై బయటికొచ్చిన అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తొక్కిసలాటకు, ఒక మహిళ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ ప్రధాన కారణమని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు.
అయితే తాజాగా మరోసారి అల్లు అర్జున్ కి నోటీసులు పంపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి రావాల్సిందిగా.. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నిన్న జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి నోటీస్ ఇచ్చారు. కాగా విచారణలో భాగంగా సీన్ ఆఫ్ అఫెన్స్ లో అవసరమైతే మరోసారి బన్నీ సంధ్య థియేటర్ కి వెళ్ళవలసి ఉంటుందట. ఇక ఈ విషయాన్ని నిన్న అల్లు అర్జున్ కి అందించిన నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది.
Also Read : Aadi Saikumar : ‘శంబాలా’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. సైకిల్ తొక్కుతున్న ఆది సాయి కుమార్..
కాగా ఈ విచారణలో బన్నీని దాదాపుగా 10 నుండి 15 ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ విచారణకు హాజరు కానున్నారు. మరి విచారణలో అల్లు అర్జున్ ఏం చెప్తాడు. విచారణ తర్వాత పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.