Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ పుట్టిన రోజు.. త్రివిక్రమ్ తో సినిమాపై అధికారికంగా అనౌన్స్.. సినిమా ఉంది.. కానీ..

అల్లు అర్జున్ మైథలాజి సినిమా చేస్తున్నాడు అనడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Allu Arjun Trivikram Movie Officially Announced Production House

Allu Arjun – Trivikram : నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్ నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడో అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తో గతంలోనే సినిమా అధికారికంగా అనౌన్స్ చేసారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ కూడా అనౌన్స్ చేసారు.

అల్లు అర్జున్ మైథలాజి సినిమా చేస్తున్నాడు అనడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా మొదలవ్వడానికి ఇంకా సమయం పట్టనుంది. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో అనౌన్స్ చేసారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నేడు సినిమా అనౌన్స్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. పాన్ వరల్డ్ లెవల్లో కమర్షియల్ సినిమా తీయబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Mission Impossible : టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..

దీంతో త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్రివిక్రమ్ తో సినిమా ఉన్నట్టు అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

 

దీంతో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఉంది కానీ అట్లీ సినిమా అయ్యాక ఆ సినిమా మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. మైథలాజి బ్యాక్ డ్రాప్ లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కథతో ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ కాంబో మూడు హిట్స్ కొట్టడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.