Mission Impossible : టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
మిషన్ ఇంపాజిబుల్ లో 7 సినిమాలు రాగా ఇప్పుడు ఎనిమిదవ సినిమా రాబోతుంది.

Tom Cruise Mission Impossible The Final Reckoning Telugu Trailer Released
Mission Impossible : హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు అన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా మిషన్ ఇంపాజిబుల్ సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ సినిమాలకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.
Also See : Pradeep – Deepika : ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రమోషనల్ సాంగ్ చూశారా..? భలే ఉందే..
ఇప్పటివరకు మిషన్ ఇంపాజిబుల్ లో 7 సినిమాలు రాగా ఇప్పుడు ఎనిమిదవ సినిమా రాబోతుంది. మిషన్ ఇంపాజిబుల్ 7వ సినిమా డెడ్ రికనింగ్ కు కంటిన్యూగా ఫైనల్ రికనింగ్ సినిమా రానుంది. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్ తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేసారు. ఆసక్తికర ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
ఇక మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్ సినిమా 2025 మే 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ముగింపు చెప్తారని అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.