Allu Arjun – Pawan Kalyan : మొత్తానికి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. ట్వీట్ వైరల్..

అల్లు అర్జున్ ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పారు.

Allu Arjun Tweet Related Pushpa 2 and Says Thanks to Pawan Kalyan

Allu Arjun – Pawan Kalyan : అల్లు అర్జున్ మరో రెండు రోజుల్లో పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే గతంలో ఎన్నికల ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా ప్రచారం చేయడంతో జనసైనికులు, మెగా ఫ్యాన్స్ విమర్శలు చేసారు. ఫ్యాన్స్ మధ్యలో ఆ వివాదం ఇప్పటికి కొనసాగుతుంది. ఆ ఎఫెక్ట్ పుష్ప మీద పడుతుందేమో అని కూడా కొంత సంశయం ఉంది.

ఇటీవల బాలయ్య అన్‌స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ గొప్పగా చెప్పి పవన్ ఫ్యాన్స్ ని కొంత కూల్ చేసారు. అయితే పుష్ప సినిమాకు ఇప్పటికే తెలంగాణాలో భారీగా టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు ఏపీలో కూడా పెంచారు. ఏపీ ప్రభుత్వం పుష్ప 2 టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు అల్లు అర్జున్ ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పారు.

Also Read : Pawan Kalyan : హరిహర వీరమల్లు షూటింగ్ నుంచి సెల్ఫీ పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. పెండింగ్ వర్క్ అంటూ పోస్ట్..

అల్లు అర్జున్ తన ట్వీట్ లో.. పుష్ప 2 సినిమా టికెట్ రేట్లను పెంచినందుకు ఏపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సినీ పరిశ్రమకు మీరు చేస్తున్న సపోర్ట్ కి ధన్యవాదాలు. అలాగే గౌరవనీయులైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసారు. దీంతో బన్నీ ట్వీట్ వైరల్ గా మారింది .

గత ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు బాగా తగ్గించడంతో అనేక సినిమాలకు లాస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ లో పుష్ప 1 సినిమా కూడా ఉంది. అప్పటి టికెట్ రేట్లతో పుష్ప 1 సినిమాకు ఏపీలో ప్రాఫిట్స్ రాలేదు. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు ఆమోదం తెలపడంతో బన్నీతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.