Allu Arjun Wife Sneha Reddy Reaction after Bunny Winning National Award
Allu Arjun : ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో(National Film Awards) తెలుగు సినిమా సత్తా చాటి దాదాపు 10 పురస్కారాలు గెలుచుకుంది. వీటిల్లో జాతీయ ఉత్తమ నటుడిగా(Best Actor) అల్లు అర్జున్ అవార్డు సాధించాడు. తెలుగులో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొదటి హీరో కావడంతో గత మూడు రోజుల నుంచి బన్నీకి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అవార్డుతో పాటు పలు అంశాల గురించి, సినిమాల గురించి కూడా మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు ఎలా స్పందించారో తెలిపారు బన్నీ.
నేషనల్ అవార్డు వచ్చాక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి(Sneha Reddy) ఎలా స్పందించిందో తెలియచేస్తూ.. నన్ను పెళ్లి చేసుకున్నాక నా భార్య కన్నీళ్లు పెట్టుకొని ఎక్కువ భావోద్వేగానికి గురైంది జాతీయ పురస్కారం వచ్చిన తర్వాతే. తాను సినిమా కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాదు. తనకి సినిమాల గురించి ఎక్కువగా తెలియదు. సినిమా చూసి బాగుందో బాగాలేదో, తనకి నచ్చిందో లేదో చెప్తుంది అంతే. నా సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, ఫ్లాప్ అయినా తన జీవితంలో మాత్రం ఏం తేడా ఉండదు. ఏదైనా పురస్కారం వచ్చినట్టు తెలిస్తే ఆ సంతోషాన్ని నాతో పంచుకుంటుంది అంతేకాని సినిమాల గురించి సలహాలు ఇవ్వదు అని తెలిపాడు.
Allu Arjun : బాలీవుడ్లో సినిమాలపై స్పందించిన బన్నీ.. చేస్తారా?
ఇక తన పిల్లల స్పందన గురించి చెప్తూ.. నాకు జాతీయ పురస్కారం రావడంపై అయాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రతిసారి కంటే ఈ సారి ఏదో పెద్దదే వచ్చింది అని అయాన్ కి అర్థమైంది. అర్హకి అంతగా ఇప్పుడే అర్ధం కావు కానీ వాళ్ళ నాన్న ఏదో సాధించాడని మాత్రం అర్థమైంది. మా అమ్మాయి సినిమాల్లో నటించింది. అయాన్ కూడా ఆసక్తి చూపిస్తే నటిస్తాడు అని తెలిపారు బన్నీ.