Allu Sneha Reddy : ఫిట్నెస్ వర్కౌట్ పాఠాలు చెబుతున్న అల్లు అర్జున్ భార్య.. వీడియో వైరల్

ఫిట్నెస్ వర్కౌట్ పాఠాలు చెబుతున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి. వైరల్ అవుతున్న వైరల్.

Allu Arjun wife Sneha Reddy shares morning fitness workouts video

Allu Sneha Reddy : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి.. రెగ్యులర్ గా బన్నీ, కొడుకు అయాన్, కూతురు అర్హకి సంబంధించిన పోస్టులను వేస్తూ అభిమానులను ఖుషి చేస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు ఫిట్నెస్ అండ్ పేరెంటింగ్ మంత్ర గురించి, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అవగాహన పోస్టులు కూడా వేస్తూ ఉంటారు. ఈక్రమంలోనే తాజాగా ఫిట్నెస్ వర్కౌట్ పాఠాలకు సంబంధించిన పోస్టు వేశారు.

ఎర్లీ మార్నింగ్ వర్క్ అవుట్స్ అంటూ స్నేహారెడ్డి ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో ఫిట్నెస్ కి సంబంధించిన కొన్ని వర్కౌట్స్ ని తెలియజేసారు. ఆ వర్క్ అవుట్స్ ని ఆమె చేస్తూ.. ఫిట్నెస్ పై అవగాహన కల్పించేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. స్నేహారెడ్డిని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి స్నేహారెడ్డి చెప్పిన ఆ ఫిట్నెస్ పాఠాలు చూసి.. మీరు ఫాలో అయ్యిపోండి.

Also read : Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. ముందస్తు బెయిల్ కోసం దర్శకుడు క్రిష్..

కాగా ఇటీవల పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం పై కూడా ఒక వీడియో షేర్ చేశారు. దానిలో స్నేహారెడ్డి ముఖ్యంగా ఆరు పాయింట్స్ ని చెప్పుకొచ్చారు. 1. క్రియేటివ్‌గా ఆలోచించేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. 2. వారం ప్రణాళికతో వాళ్లు చేయాల్సిన పనులను నిర్ణయించాలి. 3. రోజులో కాసేపు అయిన ఎండలో ప్రకృతి మధ్య గడిపేలా ఉండాలి. 4. ఫోన్స్ కి కొంచెం దూరం పెట్టి ఊహా శక్తి పెంపొందించే పనులను ప్రోత్సహించాలి. 5. చిన్నతనంలోనే పిల్లలో జాలి, కరుణ వంటి గుణాలు పెంపొందించాలి. 6. అన్నింటికంటే ముఖ్యమైనది తల్లులు తమకోసం కొంచెం సమయం కేటాయించుకోవాలి.. అంటూ మంచి సలహాలు ఇచ్చారు.

ఇలాంటి సామాజిక అవగాహన పోస్టులతో స్నేహా రెడ్డి అభిమానులను సంపాదించుకుంటున్నారు. స్నేహారెడ్డి కేవలం నార్మల్ హౌస్ వైఫ్ అండ్ మదర్ మాత్రమే కాదు, బిజినెస్ ఉమెన్ కూడా. పలు బిజినెస్స్ లో రాణిస్తూ స్నేహారెడ్డి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు