Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. ముందస్తు బెయిల్ కోసం దర్శకుడు క్రిష్..

రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు వచ్చింది. విచారణకు హాజరు కాకుండానే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ముందస్తు బెయిల్ కి అప్లై చేశారు.

Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. ముందస్తు బెయిల్ కోసం దర్శకుడు క్రిష్..

Krish Jagarlamudi apply for anticipatory bail in Radisson Drugs Case

Updated On : March 1, 2024 / 9:59 AM IST

Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ వెళ్తుంది. ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖులు, VIP పిల్లలు పేరులు మరికొన్ని యాడ్ అవుతూ మరింత సంచలనంగా మారుతుంది. ఇటీవల ఈ కేసులోకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా వచ్చి చేరింది. రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీలో క్రిష్ కూడా పాల్గొన్నారని పోలిసుల దర్యాప్తులో బయటకి వచ్చింది.

దీంతో ఆయన విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు పంపించారు. అయితే క్రిష్ మాత్రం ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు. ఆరోజు రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీకి తాను వెళ్లిన మాట నిజమేనని, కానీ డ్రగ్స్ తీసుకోలేదని, ప్రస్తుతం తాను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండడం వల్ల విచారణకు రాలేకపోతున్నట్లు.. క్రిష్ ఇప్పటివరకు పోలీసులకు చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది.

Also read : Jaya Prada : జయప్రదని అరెస్ట్ చేయాల్సిందే.. హైకోర్టు కీలక తీర్పు..

అయితే పోలీసులతో ఇలా చెప్పిన క్రిష్.. ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినట్లు తెలుస్తుంది. ఇలా ముందుగానే బెయిల్ కోసం అప్లై చేయడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రిష్ నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా..? అనే సందేహం కలుగుతుంది. మరి ఏది నిజం అనేది తెలియాలంటే.. క్రిష్ విచారణకు వస్తే గాని తెలియదు. కాగా నేడు గచ్చిబౌలి పోలీసుల ముందు క్రిష్ హాజరు అయ్యో అవకాశం ఉందని సమాచారం.

కాగా ఈ కేసులో మొత్తం 12 మంది పేరులను ఎఫ్ఐఆర్ లో చేర్చినట్లు సమాచారం. మరికొంతమంది కొత్త పేర్లు కూడా వినిపిస్తుండడంతో పోలీసులు దర్యాప్తు వస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ముగ్గురు పరారీలో ఉన్నారట. డ్రగ్స్ తీసుకున్న వారిని విచారిస్తూనే.. డ్రగ్స్ నెట్వర్క్ పై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో నిందితుడు అయిన నీల్ ప్రస్తుతం విదేశాలకు పారిపోయాడు. కాగా రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ ని అబ్బాస్ అనే వ్యక్తి సరఫరా చేసాడు.